తిరుపతి కొండకు అనుకుని అలిపిరి దిగువకు వెళ్తే సుందరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. వర్షాకాలంలో ఇక్కడకు వస్తే ప్రకృతి దృశ్యాలు, జపాతాలు కనువిందు చేస్తాయి..
స్థలపురాణం : కృతయుగం కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరునికి కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు పాతాళంనుండి భూమిని చీల్చుకుని వచ్చి వెలశాడని స్థలపురాణం.అందుకే ఈ స్వామిని కపిలేశ్వరుడని, లింగాన్ని కపిల లింగమని పిలుస్తారు. తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం ఇది.
తిరుమల కొండ మీద నుండి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుండి ఇక్కడవున్న పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈపుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవు ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు.
11వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని పాలించి మొదటి రాజేంద్ర చోళుని కాంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది.
కపిలతీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సక తీర్థాలు నాలుగు గంటలపాటు కపితీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తుల తాకిడి ఎక్కువతుంది. నిత్యం ఈ తీర్థంలో స్నానంచేసి దీపాలు వెలిగిస్తారు. కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున శివునికి లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం డిసెంబరులో తెప్పోత్సవాలు, మాఘమాసంలో 10 రోజులపాటు బ్రహ్మోత్సవాు ఘనంగా జరుగుతాయి.
ఎలావెళ్ళాలి : తిరుపతి బస్టాండ్ నుండి అలిపిరి మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి తిరుమల దేవస్థానం వారి ఉచిత బస్సులలో వెళ్ళవచ్చు.