తిరుమలకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మామండూరు పచ్చగా కళకళ లాడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. కొండలు, గుట్టలు, పిల్ల కాల్వలు, చిన్న, చిన్న జలధారలతో అటవీశాఖ వారి ఎకో టూరిజం సెంటర్ యాత్రికులకు ఆహ్వానం పలుకుతుంది.
కుటుంబ సమేతంగా విహారానికి అనువైన ప్రాంతం మామండూరు. అన్నమయ్య ఈ దారిలోనే తిరుమలకు నడిచి వెళ్లాడని అంటారు. కొందరు యాత్రికులు ఈ దారిలోనే తిరుమలకు కాలినడకన చేరుకుంటారు.
ట్రెక్కింగ్ సౌకర్యం, నైట్ క్యాంప్ సౌకర్యం కలదు. అటవీశాఖ వారి కాటేజ్ లు మరియు బస కోసం టెంట్ హౌసులు, హట్స్ అందుబాటులో ఉన్నాయి. హరిణి వారి రిసోర్స్ సెంటర్ వారి రెస్టారెంట్ మరియు సమాచార కేంద్రాలు కలవు. ఇక్కడ అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మచ్చల జింకలు, వైల్డ్ డాగ్స్ ఇక్కడ తిరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న పక్షుల జాతులు పక్లుల ప్రేమికులకు కనువిందు చేస్తాయి.
గుదులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. మామండూరు తిరుపతికి కేవలం 20 కి.మీటర్ల దూరంలో చెన్నై – కడప రహదారిలో ఉంది. బస్సులు, ప్రైవేట్ వాహనాలలో, సొంత వాహనాలలో వెళ్లవచ్చు.