కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్యరుడు కళ్యాణ వేంకటేశ్యరుడిగా వెలసిన క్షేత్రమే నారాయణవరం స్థలపురాణం : శ్రీ వేంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్టి యాగం చేశాడట. పొలాన్ని నాగలితో దున్నుతుంటే నాగలికి ఓ పెట్టె అడ్డుతగిలింది. దానిని తెరచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందట. ఆ శిశువుకు పద్యావతి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు.
తరువాత క్రమంలో వైకుంఠం నుండి బృగ్నుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకానికి రావటం. వకుళమాత ఆశ్రయంలో శ్రీనివాసుడుగా ఉండటం జరుతుంది. వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూడటం, తన తల్లి వకుళమాతను పెళ్ళి విషయం మాట్లాడాటానికి ఆకాశరాజు దగ్గరకు పంపడం జరుగుతుంది. ఇరువర్గాల వారు ఇష్టపడిన తరువాత నారాయణవనంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వైశాఖమాసం శుక్లపక్ష దశమి (శుక్రవారం) నాడు వైభవంగా జరుగుతుంది.అప్పటి నుండి ఈ ప్రాంతం నారాయణవరంగా ప్రసిద్ధి పొందినది.
శ్రీనివాసుడు తన కళ్యాణానికి కుబేరుడి దగ్గర 14.14 కోట్ల రామ నిష్కములు (రామ మాడలు) తీసుకున్నాడని బ్రహ్మాండపురాణాంలో ఉన్నది. తరువాత ఆకాశరాజు చిన్నగుడిని కట్టిస్తాడు. తరువాత కాలంలో యాదవరాజు, కార్వేటి సంస్థానాధీశులు, శ్రీకృష్ణదేవ రాయల వంశస్థలు ఈ ఆయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ ఆవరణలో ఓ తిరగలి ఉంది. అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు.
ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఎలా వెళ్ళాలి :
నారాయణవరం తిరుపతికి 40 కి.మీ దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా రేణిగుంట స్టేషన్‌లో దిగి అక్కడ నుండి పూత్తూరు వెళ్ళి అక్కడ నుండి 5 కి.మీ దూరంలో ఉన్న నారాయణవరంనకు చేరుకోవచ్చు. తిరుపతి -చెన్నై రోడ్డు మార్గం ద్వారా నారాయణవరంనకు బస్సులలో వెళ్ళవచ్చు.