1997 సం.లో ఆలయం ఉత్తర భాగం వైపు నిర్మించిన ఈ మ్యూజియం భారత దేశంలోనే అత్యధికులు సందర్శిస్తున్న ప్రదర్శనశాల
అన్నమయ్య తిరుమలేశునికి వేల సంకీర్తనలు అర్చించాడు. ఆ వాగ్గేయకారుని పద సంపద దర్శించాలనుకుంటే. శ్రీవేంకటేశ్వర మ్యూజియానికి తప్పక వెళ్లాలి. 16వ శతాబ్దంలో అన్నమయ్య రాసిన సంకీర్తనలు అక్కడ రాగిరేకులపై చూడవచ్చు.
ఏడుకొండలవాని వాహనాలు, అపురూప చిత్రాలు, అందమైన విగ్రహాలు, భిన్న కళాకృతులు ఎన్నిటినోఇక్కడ చూడవచ్చు. 1.25 లక్షల చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో వీటన్నిటినీ భద్రపరిచారు.
ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 నిమిషాల వరకు ఈ మ్యూజియం తెరచి ఉంటుంది.
మ్యూజియం పైన మెడిటేషన్ చేయటానికి సౌకర్యం కలదు. కర్ణాటక గెస్ట్ హౌస్ దగ్గరలో మ్యూజియం కలదు