మానవసేవే మాధవసేవ అనే పెద్దల మాటనూ భక్తులు కోరుకునే పత్యేక దర్శనం అవకాశాన్ని కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంవారు 2001లో ప్రవేశపెట్టిన శ్రీవారిసేవా పథకం.
పదిమందికి తక్కువకాకుండా ఒక బృందంగా ఏర్పడి వారం పాటు తాము తిరుమలలో స్వచ్ఛందసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ శ్రీవారి సేవాసెల్‌కు ధరఖాస్తుచేసుకోవాలి. ధరఖాస్తు చేయవలసిన అడ్రస్
శ్రీవారి సేవాసెల్, అన్నదానం కాంప్లెక్స్ ఎదురుగా
తిరుమల, ఫోన్ : 0877-2263293
ఇతర వివరాలకోసం : పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల ఫోన్ : 0877-2264217
సేవచేయవలసిన ప్రదేశాలు : అన్నదానసత్రం, క్యూలైన్లు, కళ్యాణకట్ట, భక్తులు అలిపిరి - తిరుమల కాలినడక మార్గం, ఉచితంగా సామాన్లు భద్రపరచే గదులు, పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరిణి, సమాచారకేంద్రం శ్రీవారి ఆలయం వీటిటో ఎక్కడ సేవ చేయాలని వుందో ముందుగా తెలియపరిస్తే భక్తుల ఆసక్తిని బట్టి వారికి ఆయా స్థానాలు కేటాయిస్తారు. ఇక్కడ పేదా గొప్ప తారతమ్యంలేదు ఎవరైనా శ్రీవారిసేవలో పాల్గొనవచ్చును.
నియమ నిబంధనలు
మొదట అడిగినవారికి మొదట అనే పద్ధతిలో వీలునుబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు స్వచ్ఛంద సేవా అవకాశాన్ని కలిగిస్తారు. ఇక ఆ ఏడురోజులు దేవస్థానం వారు ఇచ్చిన కాషాయవస్త్రాన్ని భుజాల చుట్టూ ధరించి అనుక్షణం గోవిందనామస్మరణచేస్తూ వుండాలి. తెల్లవారుజామున నగర సంకీర్తనం చేయాలి. ఇందుకు కావలిసిన పరికరాలను దేవస్థానంవారు అందిస్తారు.
దేవస్థానం సిబ్బందితో కలిసి ఈ ఏడురోజులు రోజుకు నాలుగు గంటలనుండి ఆరుగంటలపాటు సేవచేయాల్సి వుంటుంది. ఆ ఏడురోజులు దేవస్థానంవారే ఉచితభోజన సదుపాయం కల్పిస్తారు.