సుమారు 300 అడుగుల ఎత్తున్న ఈ జలపాతం పిల్లలకుకు మరియు పెద్దలకు మంచి విహారకేంద్రం. రెండు కొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. కొలనులో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కాని ఎటు వెళ్తుందో తెలియదు. ఈ తీర్థానికి అత్యంత ఎత్తులో పాపనాశనం ఉంది.
3 శతాబ్ధానాటి గిల్లితీగ అనే మొక్క తలకోనకే తలమానికమని చెబుతారు. ఈ మొక్కలోని ప్రతిభాగం ఔషధ యుక్తమే. గిరిజనులు ఈ మొక్కను వివిధ వ్యాధుల నివారణకు వాడతారట. ఈ మొక్క కాయలు మూడున్నర అడుగుల నుండి నాలుగడుగుల దాకా ఉంటాయంటారు.
ఇక్కడ తెల్లని ఆర్కిడ్ పుష్పాలు, మద్ది, జాలరి, చందనం, రక్తచందనం మొలదగు వృక్ష సంపదను చూడవచ్చును. అడవికోళ్ళు, నెమళ్ళు దేవాంగన పిల్లులు, ఎలుగుబంట్లు, ముచ్చుకోతులకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. 40 అడుగుల ఎత్తుమీద కట్టిన తాళ్ళవంతెన ప్రత్యేకం.పడవలలో విహారం చేయవచ్చును. పచ్చని శాలువా కప్పుకున్నట్లు తూర్పు కనుమల అందాలు కనువిందు చేస్తాయి. మంచి టూరిస్టు కేంద్రం
ఎలా వెళ్ళాలి : తిరుపతి నుండి సుమారు 50 కి.మీ దూరంలో యర్రవారి మండలంలో కలదు. తిరుపతి నుండి బస్సులలో వెళ్ళవచ్చు.