header

RTC Travelling Packages…తిరుపతి నుండి ఆర్టీసీ వారి పర్యాటక ప్యాకేజీలు

RTC Travelling Packages…తిరుపతి నుండి ఆర్టీసీ వారి పర్యాటక ప్యాకేజీలు

ప్యాకేజ్ 1 : తలకోన జలపాతం, సిద్దేశ్వర స్వామి వారి ఆలయం, తలకోన వ్యూ పాయింట్, హార్స్ లీ హిల్స్. ఉదయం 6 గంటలకు తిరుపతిలోని శ్రీనివాసం నుండి బస్ బయలుదేరి తిరగి రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, ఉపాహారం, గైడ్ ఖర్చులతో కలిపి పెద్దలకు రూ.1250- రూపాయలు, పిల్లలకు రూ.900- చెల్లించాలా. ఏ.సి వాహనంలో ప్రయాణం
ప్యాకేజ్ 2 : శ్రీ కాళహస్తి ఆలయం, శ్రీ సిటీ సెజ్, సూళ్లూరు పేట చెంగాలమ్మ గుడి, మైపాడు బీచ్. తిరుపతిలోని శ్రీనివాసం నుండి ఉదయం 6 గంటలకు ఏ.సి. బస్సు బయలుదేరి తిరగి రాత్రి 8 గంటలకు శ్రీనివాసంకు వస్తుంది. ఉదయం, మధ్యాహ్నం ఆహారం. పెద్దలకు రూ.1350- పిల్లలకురూ.950- రూపాయలు చెల్లించాలి.
ప్యాకేజ్ 3 : తిరుపతి, పలమనేరు కోటిలింగాల ఆలయం, రామకుప్పం నన్యాల ఏనుగుల సంరక్షణ కేంద్రం, హోగినేకల్ (కర్ణాటక), కుప్పం గంగమ్మ ఆలయం. రెండురోజుల ప్రయాణం. తిరుపతిలో ఉదయం 9 గంటలకు ఏ.సి బస్సు బయలుదేరుతుంది. మూడుపూటల ఆహారం, ఏ.సి. రూంలలో వసతి. పెద్దలకు రూ.2750- పిల్లలకు రూ.1850- చెల్లించాలి.
ప్యాకేజ్ 4 : తిరుపతి పరిసరాలలోని తిరుచానూరు, తొండవాడ అగస్తేశ్వర ఆలయం, శ్రీనివాస మంగాపురం, కపిలతీర్ధం, గోవిందరాజస్వామి ఆలయాలు. ఎ.సి బస్ రూ.150- నాన్ ఏ.సి బస్ కు రూ.100-లు. ఉదయం 6 గంటలనుండి ఒంటిగంటలోపు యాత్ర ముగుస్తుంది. రోజుకు ఎనిమిది ట్రిప్పులు బస్సులు నడుస్తాయి.
ప్యాకేజ్ 4 : నాగలాపురం, అప్పలాయగుంట, నారాయణవనం, కార్వేటి నగరంలోని వేణుగోపాల స్వామి ఆలయం, నగరిలోని కరియ మాణిక్యస్వామి ఆలయం, బుగ్గలోని అన్నపూర్ణ కాశీవిశ్వేశ్వరాలయం, సురుటుపల్లెలోని ఆలయాలు. ఏ.సి బస్ రూ.305- నాన్ ఏ.సి బస్ 250- చెల్లించాలి. శ్రీనివాసంనుండి, విష్ణు నివాసం నుండి బస్సులు రద్దీని బట్టి నడుపుతారు.
ప్యాకేజ్ 5 : స్థానిక ఆలయాలతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఏ.సి బస్ కు 350- నాన్ ఏ.సి. బస్ కు రూ.250- చెల్లించాలి.
ప్యాకేజ్ 6 : తిరుపతి నుండి కాణిపాకం, వేలూరులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం (గోల్డెన్ టెంపుల్) ఏ.సి. బస్ కు రూ.750-, నాన్ ఏ.సి. బస్ కు రూ.500- చెల్లించాలి.