పేరుకు రైస్ కానీ అన్నం ఉండదు క్యాలీఫ్లవర్ రైస్లో... క్యాలీఫ్లవర్ నుసన్నగా తురిమి కొద్దిగా వేడిచేస్తే క్యాలీఫ్లవర్ రైస్ తయారవుతుంది.
ఈ క్యాలీఫ్లవర్ రైస్ తో మాములుగా వండుకునే అన్నం, పులావ్, ఫ్రైడ్ రైస్, కిచిడి, బిర్యానీ, పాయసం, పొంగలి, ఉప్మా తయారుచేసుకోవచ్చు.
లేదా తెల్ల అన్నంలాగానే తయారు చేసుకుని అందులోనే కూరలు కలుపుకొని తినవచ్చు.
క్యాలీఫ్లవర్ లో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రక్షించడం ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులబారిన పడరు. ఇందులోని మెగ్నీషియం కండరాల పనితీరుకు, బీ.పి నియంత్రణకు తోడ్పడతాయి
ఫోలెట్లు, విటమిన్ బి 6 నాడీవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
విటమిన్ కె ఎముకలను కాపాడుతుంది. క్యాలీఫ్లవర్ లోని సల్ఫోరా పేన్ శరీరంలో అసహజ కణాలు పెరగకుండా అడ్డుకుంటుంది.
క్యాలీఫ్లవర్ రైస్ లో కార్బో హైడ్రేట్స్ (పిండిపదార్థాలు) చాలా తక్కువగా ఉంటాయి. వందగ్రాముల రైస్ నుండి కేవలం 40 గ్రాముల పిండిపదార్థాలు మాత్రమే లభిస్తాయి.
204 గ్రాముల కేలరీస్, 2.1 గ్రాముల ప్రోటీన్లు, 2.1 గ్రాముల పీచు పదార్ధాలు ఉంటాయి.
బియ్యానికి బదులుగా క్యాలీఫ్లవర్ రైస్ తింటుంటే బరువు తగ్గుతారు. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్ రైస్ ను కీటో డైట్ లో భాగంగా తింటున్నారు.
గ్రేటర్ లేదా ఫుడ్ ప్రాసెసర్ తో కాలీఫ్లవర్ ని తురిమి బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఇంట్లోనే తాజాగా చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఓ నిమిషం బ్లాటింగ్ పేపర్ మీద వేస్తే తడి ఆరిపోతుంది. లేదా పేపర్ మీద పరచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టవచ్చు.
తరువాత పాన్ లో కాస్త వెన్న లేదా నూనె వేసి కాలీఫ్లవర్ తురుమును వేసి, కొద్దిగా ఉప్పు చల్లి మూతపెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికిస్తే రైస్ తయారవుతుంది. చల్లారాక దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే రెండుమూడు రోజులు నిల్వ ఉంటుంది. అయితే ఫ్రీజ్ చేసినవి వాడుకోవడానికి ఓ రెండుమూడు గంటల ముందే తీసి బయటపెట్టుకోవాలి.
కాలీఫ్లవర్ రైస్ ప్యాకెట్లు మార్కెట్లోనూ లభిస్తున్నాయి. కాలీఫ్లవర్ కు. మసాలాలూ, కూరగాయలూ ఏవి జోడించినా రుచిగా ఉంటుంది. అందుకే కాలీఫ్లవర్ నే అన్నంగా తినేస్తున్నారు.
నిమ్మ, వెల్లుల్లి, పుదీనా వంటివి క్యాలీఫ్లవర్ లో కలిపి వివిధ రుచులను ఆస్వాదించవచ్చు.