
Cheriyal Paintings….Telangana…చెరియాల లేక నకాషి చిత్రకళ తెలంగాణా జిల్లాలోని చెర్యాల గ్రామంలో ఆవిర్భవించింది. ఈ ఊరిపేరుతోని ఈ చిత్రకళను పిలుస్తారు. దీనికి 2009 లో జీఐ(భౌగోళిక గుర్తింపు) లభించింది. సంప్రదాయ పెయింటింగ్స్ , బొమ్మల తయారీ కూడా ఈ కళ ప్రత్యేకత.
చింతగింజల పొడి, చెక్కపొట్టు, సహజ రంగులు, పాత కాటన్ బట్టలు,సుద్ద పొడి, హ్యాండ్లూమ్ బట్ట, తిరువని గొంద్ ఇలా అన్ని ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో ఉపయోగించి చేర్యాల పెయింటింగ్స్ తయారవుతాయి..పెద్దగా ప్రాచుర్యం, ఆదరణ లేకపోయినా కూడా దాదాపు 500 ఏళ్ల నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ నేటి కాలానికి తగ్గట్లు తమ శైలి మార్చుకుంటూ ఇప్పటికీ తన ప్రత్యేకత నిలుపుకుంటోంది నకాషీ చిత్రకళ..
ఈ కళకు మూలం నకాషీ కులస్తులు దనాలకోట వెంకటరామయ్య . దనాలకోట వెంకటరామయ్య నుంచి చంద్రయ్య,భారతమ్మ, వైకుంఠం, నాగేశ్వర్, పద్మ, వెంకటరమణ, పవన్ ఇప్పుడు వీరి నాల్గోతరం సాయికిరణ్, శ్రవణ్ కుమార్‌లు ఈ కళను వారసత్వ సంపదగా భావించి ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు.
ప్రస్తుతం నాలుగు కుటుంబాలే ఈ కళను కొనసాగిస్తున్నాయి. వీరితో పాటు ఈ కళను నేర్చుకున్న మరో మూడు కుటుంబాలు ప్రస్తుతం ఉన్నాయి.
ఒకప్పుడు ఈ కళతో పెయింటింగ్స్,బొమ్మలు, అట వస్తువులు, మాస్క్‌లు,ఆలయ చిత్రాలు, విగ్రహాలు చేసేవారు.
దాదాపు 20 నుంచి 25 మీటర్ల హ్యాండ్లూమ్ బట్టను కాన్వాసుగా మార్చి జానపద కథలు,పురాణాలు, మహాభారతం, రామాయణ వంటి ఇతివృత్తాలను ఇతివృత్తాన్ని చిత్రీకరించేవారు. దీనికి కొన్ని నెలల సమయం పట్టేది.నేటి అవసరాలకు అనుగుణంగా నకాషీ కళ డిజైన్లను నవతరం చిత్రీకరిస్తుంది.
జాతరలలో వాడేలా మాస్క్‌ల సైజు తగ్గించడంతో వాటి ఆదరణ పెరిగింది. ఇక ఇంటిగోడలపై అందంగా అలంకరించేలా 40, 45 మీటర్ల పెయింటింగ్స్‌ను తయారు చేయడంతో వాటిని కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పురాణాలను వివరించేలా చిన్న సైజులో తయారు చేస్తున్న చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
నకాషీ కళతో కళ్లజోడు పెట్టుకునే స్టాండ్, పెన్ స్టాండ్, కీ చైయిన్లు కూడా తయారు చేస్తున్నారు. వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది
ఈ నకాషీ కళాకారుల కుటుంబ సభ్యులు ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు.