Cybercrimes….. Online Cheatings… సైబర్ నేరాలు...

ATM Cards Cloning… నైజీరియా దేశస్తులు. ఏటీఎం కార్డు అప్డేట్, లాటరీ వచ్చిందని, ఇలా పలు కారణాలు చెబుతూ అందినకాడికి దోచుకునేవారు. అయితే తాజాగా రొమేనియన్లు ఏటీఎం కార్డుల క్లోనింగ్ కోసం దేశంలోకి చొరబడ్డారు. వీరు కార్డులను క్లోనింగ్ చేయడంలో ఆరితేరారు.
దేశంలోని పలు పట్టణాల్లోకి వచ్చి ఏటీఎం సెంటర్లలో స్కిమ్మ ర్లు, కెమెరాలు పెట్టి డేటాను చోరీ చేసి.. ప్రధాన సైబర్ నేరగాడికి చేరవేస్తున్నారు. ఇలా డేటా చోరీకి పాల్పడుతున్న రొమేనియా దేశానికి చెందిన నిందితులను గత యేడాది ఏప్రిల్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి మోసాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి అబిడ్స్ పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అబిడ్స్ పోలీసుల దర్యాప్తులో పలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
స్కిమ్మింగ్.... ఏటీఎం మిషన్‌లో డబ్బులు డ్రా చేసే చోట మ్యాగ్నటిక్ రీడర్, ఒక స్పై కెమెరాను ఈ ముఠాలు అమరుస్తాయి. ఏటీఎం కేంద్రంలోకి వినియోగదారుడు వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు కార్డును స్వైప్ చేసిన సమయంలో కార్డు వివరాలు మ్యాగ్నటిక్ రీడర్ కాపి చేస్తుంది. పిన్ నంబర్‌ను కెమెరా రికార్డు చేస్తుంది. ఇలా ఒక రోజంతా ఆ కార్డు మిషన్‌లో ఉంటే ఆ రోజు ఏటీఎం కార్డులో డబ్బులు డ్రా చేసిన వారి వివరాలు కాపీ చేస్తుంది.
అయితే ఈ ముఠాలు ఒక రోజంతా మ్యాగ్నటిక్ రీడర్, కెమెరాను ఒకే దగ్గర ఉంచకుండా జాగ్రత్త పడుతారు. కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తొలగించి, మరో చోట ఏర్పాటు చేస్తారు. ఎక్కువ సమయం ఒకే దగ్గర ఉంచితే గుర్తిస్తారనే అనుమానంతో ఇలా మారుస్తుంటారు. సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాల్లో ఈలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి.
స్కిమ్మింగ్ ద్వారా సేకరించిన డేటాను ఎప్పడికప్పుడు.. తమ బాస్‌కు చేరవేస్తుంటారు. అయితే ఇక్కడ స్కిమ్మింగ్ చేసే వారిచేతిలో ల్యాప్‌టాప్‌లు బాస్.. వీరి కంప్యూటర్‌ను టీమ్ వ్యూహార్‌తో యాక్సెస్ చేసుకుంటూ.. వీరి వద్ద ఉండే డేటాను తన కంప్యూటర్‌లోకి ఎప్పటికప్పుడు కాపీ చేసుకుంటాడు. అలా సేకరించిన డేటాతో క్లోనింగ్‌తో కొత్త కార్డులను తయారు చేస్తాడు. క్లోనింగ్ కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేసేందుకు మరో టీమ్‌తో ఒప్పందాలు చేసుకుని పంపిస్తారు.
Lottery Messages…
ప్రఖ్యాత కంపెనీల పేరు వాడుకుని మీ ఫోన్ కు పెద్దమొత్తంలో లాటరీ వచ్చిందని మెసేజ్ పంపుతారు.
ఊరికే డబ్బు వస్తుందని ఆశపడినవారు ఈ సమాచారానికి సమాధానం ఇస్తే వారి మాయలో పడ్డట్టే.... లాటరీ డబ్బు మీ అకౌంట్ కు పంపాలంటే కొంత ఖర్చు అవుతుందని చిన్నగా ముగ్గులోకి దించి కొద్ది, కొద్ది మొత్తాలను తాము సూచించిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరతారు.
ఆశపడ్డవారు పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని వారు అడిగింది కొద్ది మొత్తమేనని వారు అడిగిన డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తారు. అలా చిన్నగా పలు తఫాలు అనేక కారణాలు చెప్పి డబ్బులు దోచుకుంటారు. డబ్బు పంపినవారు చివరకు మోసపోయామని తెలుసుకునే సరికి వారు ఫోన్లు కట్ చేస్తారు. వారినుండి ఎటెవంటి సమాచారం ఉండదు. ఇటువంటి మెసేజ్ లకు స్పందించకండి. సాధారణంగా పెద్దమొత్తాలలో లాటరీ వచ్చినపుడు తప్పని సరిగా పేపర్లలో వార్త ప్రసురిస్తారు. లేక టి.వీ. లలో ప్రకటిస్తారు. ఈ విషయాలు మీతో మాట్లాడిన వారిని అడగండి. ముందుగానే మీ సమీప పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వండి
Falls Email Messages… మోసపూరిత సందేశాలు..
మేము ఫలానా దేశంలో ఉంటున్నామని మా దగ్గర కోట్లకొద్ది డబ్బు ఉందని, మీదేశంలో పెట్టుబడి పెట్టటానికి మీ సహాయం కావాలని, మీరు నమ్మకస్తులని మిమ్మల్ని సంప్రదిస్తున్నామని ఫోన్ లేదా ఈ మెయిల్ సందేశాలు పంపిస్తారు.
ఉదాహరణకు : My name is Mrs. Park Geun-Ryeong, I am a female investor from South Korea , I want to invest in India and I need your services. 30% yours..70% ours,,,$100,00,000…Please email to….. వీటికి సమాధానం ఇవ్వకండి.
ఒక వేళ మీరు వారిగురించి తెలుసుకోవాలంటే వారి అడ్రస్, వారి గవర్నమెంట్ జారీచేసిన ఐడెండిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వారికి ఏ బ్యాంకులో ఖాతా ఉన్నదో ఖాతా నెంబరు, బ్యాంకు వివరాలు, బేంక్ ఖాతా బుక్ కాపీలు, ఇన్ కం టాక్స్ రిటన్స్ అడగండి దీనితో వారి బండారం బయటపడుతుంది.
ఒకవేళ మీరు ఆశపడితే పెద్దమొత్తంలో మీపేరుమీద డబ్బు కొన్న ఖర్చులుంటాయని, దానికి మీరు కొంత చెల్లించాలని దఫా దఫాలు అనేక రకాలుగా మిమ్మల్ని ఆశపెట్టి మీదగ్గర నుండి డబ్బు గుంజుతారు. మీరు నిజం తెలుసుకునేసరిగా వారినుండి సమాచారం ఉండదు. ఫోన్లు బంద్. ఇలాంటి సందేశాలు వస్తే మీబ్యాంకర్లను సంప్రదించండి, మీ సమీప పోలిస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయండి.
ATM, Credit Cards Update cheatings….మీ ATM/Credit కార్డ్స్ అప్ డేట్ చేయాలి....? వివరాలు తెలపండి..
ఈమధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ బ్యాంక్ కార్డులు అప్ డేట్ చేయాలి. వివరాలు పూర్తి చేయండి అని మెయిల్స్, సందేశాలు పంపుతారు. బ్యాంకులకు సంబంధించి వెబ్ సైట్లకు డూప్లికేట్ వెబ్ సైట్లు తయారుచేసి వివరాలు నింపమంటారు...నమ్మి మీ వివరాలు పూర్తిచేశారో....క్షణాలలో మీ ఖాతాలనుండి పెద్దమొత్తాలు మాయమవుతాయి...
ఇలాంటి వాటికి స్పందించకండి... బేంక్ లు ఖాతాదారుల నుండి ఇలాంటి వివరాలు ఎప్పటికీ అడగవు. నేరుగా మీ బేంక్ కు వెళ్లి కంప్లయింట్ చేయండి, సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్వాదు చేయండి.
సందర్శకులకు గమనిక : ఈ సమాచారాన్ని చదినవారు, మీ మిత్రులకు, మీ బంధువులకు, తెలిసిన వారందరికి ఈ లింక్ షేర్ చేయండి. వారుకూడా ఇలాంటి మోసాలు గురించి తెలుసుకుని జాగ్రత్త పడతారు www.telugukiranam/trending/cybercrimes-online-cheetings.html