Benefits of earthen vessels…మట్టి పాత్రలలో వండే ఆహారం

Benefits of earthen vessels…మట్టి పాత్రలలో వండే ఆహారం
మట్టి పాత్రలలో వండే ఆహారం అన్నింటికంటే శ్రేష్టమైనది. మట్టి పాత్రలో వండిన ఆహార పదార్ధాలను పరీక్ష చేయిస్తే వచ్చిన ఫలితాలు .......ఈ పదార్ధాలలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ (పోషకాలు) కూడా తగ్గలేదు . ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని కూడా టేస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియన్స్ మాత్రమే ఉన్నాయి . 93% లేక 87% న్యూట్రియన్స్ దెబ్బతింటాయి లేక లోపిస్తాయి అని తేలింది .
మట్టిపాత్ర లో వండిన పదార్ధములో 100% న్యూట్రియన్స్ ఉన్నాయి . ఈ పదార్ధాపు రుచి కూడా కమ్మగా ఉంటుంది.
మన పూర్వీకులు వంటకు, మంచినీళ్లకు మట్టి పాత్రలు వాడటం వలనే వారికి జీవితాంతం కళ్ళజోడు రాలేదు, పళ్ళు ఊడిపోలేదు , మోకాళ్ళ నొప్పులు , డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు. ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించగలం. డయాబెటీస్ తో బాధపడేవారు మట్టిపాత్రలలో భోజనం వండుకుని తింటే సుమారు కొన్ని నెలలోపే ఖచ్చితంగా డయాబెటీస్ రోగం నుండి విముక్తులవుతారు. ఆనందంగా జీవిస్తారు.
మనం వంటకు ఉపయోగించే పాత్రల్లో లభ్యమయ్యే పోషకవిలువల శాతము
మట్టికుండలో …. 100%
కంచు పాత్రలో ……97%
ఇత్తడి పాత్రలో ………93%
అల్యూమినయం ప్రెషర్ కుక్కర్ లో…7% లేక 13%
అల్యూమినియం పాత్రలలో ఆహారం వండటంగానీ , నిలువ వుంచటానికి గానీ ఏ మాత్రం మంచిది కాదు . ఈ పాత్రలలో వండిన ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ తింటూ వుంటే వారికి మధుమేహం , జీర్ణ సంబంధిత , టి.బి. ఆస్తమా మరియూ కీళ్ళ సంబంధ వ్యాధులు తప్పకుండా వస్తాయి . ఈ రోజు అందరి ఇళ్ళలోకి అల్యూమినియం పాత్రలు వచ్చాయి.
ప్రెషర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో వండే పదార్ధం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది . కానీ ఉడకదు. పదార్ధం ఉడకడం వేరు మెత్తబడడం వేరు. అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్ధం వండబడాలి . మెత్తబడితే సరిపోదు . ఇది ప్రకృతి ధర్మం, ఆయుర్వేద సిద్ధాంతం.