Hot Water Benefits….వేడినీటి ఉపయోగాలు...

Hot Water Benefits….వేడినీటి ఉపయోగాలు...
వేడినీరు (గోరు వెచ్చని నీరు) ప్రతీరోజూ క్రమం తప్పకుండా తాగుతుంటే రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేడినీరు వల్ల మరో అద్భుతమైనటువంటి ప్రయోజనం, ఇది రక్తప్రసరణను పెంచుతుంది. ముఖ్యంగా శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. అదే సమయంలో నాడీవ్యవస్థలో కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
క్రమం తప్పకుండా వేడి నీళ్ళు తాగడం ద్వారా శరీరాన్ని తేమగా, వెచ్చగా ఉంచుకోవచ్చు. శరీరం రక్త ప్రసరణను పెంచి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ముఖంలో మొటిమలు మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతుంది. వేడినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలోపలి నుండి శుభ్ర పడుతుంది.
దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి సమస్యలున్నప్పుడు వేడినీళ్ళు త్రాగడం సహజమైన గృహచికిత్స. ఇది నిరంతరం వేధించే పొడి దగ్గును తగ్గించి.. శ్వాసనాళాన్ని తేలికచేసి, శ్వాస పీల్చుకొనేందుకు సహాయపడుతుంది. అలాగే గొంతునిప్పిని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు