
ఆక్సలేట్లు లేదా ఫాస్పరస్ తో కాల్షియం కలవటం వలన కిడ్నీలలో రాళ్లు తయారవుతాయి. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వలన కూడా కిడ్నీలలో రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీలలో రాకుండా ఉండాలన్నా, లేక ఉన్న రాళ్లు పోవాలన్నా నీళ్ళు ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు లీటర్ల నీరు తాగలి.
వేసవిలో ఇంకా ఎక్కువగా నీళ్లు తాగాలి. మజ్జిగ, నిమ్మరసం, బత్తాయి రసం కూడా తాగితే మంచిదే. నిమ్మజాతి పండ్లనుండి వచ్చే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తుంది. కనుక నిమ్మ, నిమ్మజాతి పండ్లు నిమ్మ, (నిమ్మకాయలను నేరుగా తినకూడదు) దబ్బ, నారింజ, కమలా, బత్తాయి పండ్లను ఆయా సీజన్లలో తప్పనిసరిగా తినాలి.
కాల్షియం పుష్కలంగా లభించే పాలు, పెరుగు, పన్నీర్, చీజ్ లతో పాటు అన్ని ఆకుకూరలు తినవచ్చు. వీటితో లభ్యమయ్యే కాల్షియం ఎక్కువైనా కరిగిపోతుంది.
కానీ సప్లిమెంట్ల రూపంలో తీసుకునే క్యాల్షియం ఎక్కువైతే అది కిడ్నీలలో రాళ్లుగా మారుతుంది. కనుక కాల్షియం సప్లిమెంట్లు డాక్టర్ సలహా లేనిదే వాడరాదు.
యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నవారు మాంసాహారం తింటే ప్రమాదం. రాళ్లు కరిగేంత వరకు టమాటోలు మితంగా తినాలి. సోడియం ఎక్కువగా ఉండే బయటి చిరుతిళ్లు, బేకరీ ఫుడ్స్, రెస్టారెంట్ల ఆహారం, ఫాస్సరస్ అధికంగా ఉండే శీతల పానీయాలకు దూరంగా ఉంటే మంచిది.