బ్లీచింగ్ చేయటం కోసం కలిపే కెమికల్స్ క్లోరిన్ బెంజాయిక్, కాల్షియం పెరాక్సైడ్, ఎంజోడై కార్బనమైడ్ ప్రధానమైనవి. ఎండోస్పెర్మ్ తో జరిపే రసాయనిక చర్య వలన ఎలోగ్సిన్ అనే మరో కెమికల్ ఉత్పత్తి కణాలను ధ్వంసం చేసి డయాబెటిస్ను కలిగిస్తాయి.
మైదాతో తయారు చేసే పూరీలు, నిమ్కీన్స్, పునుగులు, చల్ల బూరెలు, బొబ్బట్లు, వైట్ బ్రెడ్, రకరకాల కేకులు, సమోసాలు, పేస్ట్రీలు, కాజాలు, మొదలైనవి మైదా వంటకాలలో ప్రధానమైనవి . పాలకోవా, బర్ఫీలలో వ్యాపారార్థమై మైదాను కలిపేస్తారు.
మైదాతో తయారయ్యే పదార్ధాలు మితంగా తినటం లేక మానివేయటం మంచిదంటున్నారు ఆహార నిపుణులు