మునక్కాయలో ఐరన్, కాల్షియం, విటమిన్లు మునగలో బాగా ఉన్నాయి. దీంతో ఇది లైంగిక శక్తిని సైతం పెంచుతాయి.
జీడిపప్పు నరాలకు పటుత్వాన్ని కలిగించడంతో పాటు, లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాల బలహీనతను పోగొట్టడంతో నరాలకు పటుత్వం కలిగిస్తుంది
పుచ్చకాయలో సిట్రులిన్ అనే అనే ఎమినో అసిడ్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలను వ్యాకోచింప చేస్తాయి. తద్వారా లైంగికావయాలకు రక్తప్రసరణ బాగా జరిగి లైంగిక ఆనందం పెరుగుతుందంటారు నిపుణులు. సీజన్ లో వచ్చే పుచ్చకాయలు రోజూ మితంగా తినవచ్చు
వీర్యకణాలు వృద్ధి చేయడంలో చిలగడ దుంప బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో (స్వీట్ పొటాటో) చిలగడ దుంపను చేర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే చిలగడ దుంపలో అత్యధిక స్థాయిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అలాగే ప్రి రాడికల్ డ్యామెజ్ నుంచి చిలగడ దుంప రక్షిస్తుందని చెబుతున్నారు
ఎండు ఫలాలలో వాల్ నట్ ఒకటి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ బి3 లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మగవారిలో వీర్యకణాల నాణ్యతను పెంచుతాయి. రక్తనాళాలను వ్యాకోచింపచేసి జననాంగాలకు రక్తప్రసరణను పెంచుతాయి.
డార్క్ చాక్లెట్లు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. వీటిలోని ఫెని లెద్యమిన్ , సెరటోన్లు మెదడును ఉత్తేజపరుస్తాయి. మహిళలో ఎండార్పిన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. శృంగారానికి ముందు డార్క్ చాక్లెట్ తింటే మరింత ఉత్సాహంగా ఉంటుంది.
అరటిపండు పురాతన కాలం నుండి భారతీయుల ఆహారం. తక్షణశక్తికి, బరువు పెరగటానికి అరటిపండును తింటారు. అరటిపండు నేచురల్ బూస్టర్ గా పనిచేసి మగవారిలో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది.అరటిపండులో ఎ, బి, సి విటమిన్లు మరియు పొటాషియం ఉంటాయి.
విటమిన్ బి మరియు పొటాషియం సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచటానికి దోహదం చేస్తాయి.
బాగా పండిన అరటిపండులో చక్కెరశాతం ఎక్కువగా వుంటుంది. ఈ ఫ్రక్టోజ్ చక్కెర తిన్నవెంటనే రక్తంలో కలసి శక్తి వస్తుంది.
మగవారిలో లైంగిక సమస్యల పరిష్కారానికి ఆయుర్వేదంలో యాలకులను ఉపయోగిస్తారు. మగవారిలో వయాగ్రాగా పనిచేస్తుంది. యాలకులను తిన్నప్పుడు వచ్చే సువాసన వలన మనసుకు ప్రశాంతత కలిగుతుంది.
రక్తహీనత కలవారిని దానిమ్మ గింజలు తినమని వైద్యులు సూచిస్తారు. దానిమ్మలోని ఐరన్ ఎర్రరక్తకణాల ఉతత్తికి సహాయపడటం వలన శరీకంలో మరింత రక్తం తయారవుతుంది. రక్తప్రసరణ చక్కగా జరిగి లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది.