Giant Marine Sinkhole గా పిలువబడే ఈ సముద్రంలో ఏర్పడిన ఓ వింత పరిణామం. ఇది 15 వేల సంవత్సరాల క్రితం ఏర్పడినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని విశేషం ఏమిటంటే ఇది 1043 అడుగుల చుట్టుకొలతతో ఉండి 407 అడుగుల తోతుగా ఉంటుంది. ఇది యునెస్కో చేత ప్రపంచ వారసత్య సంపదగా గుర్తింపు పొందింది.
స్కూబా డైవింగ్ అంటే ఇష్టపడేవారికి ప్రపంచంలో ఇంతకన్నా మరో స్కూబా డైవింగ్ ప్రాంతం లేదంటారు. స్వచ్ఛమైన ఈ నీటిలో డైవింగ్ చేసేవారికి రకరకాల చేపల జాతులు దర్శనమిస్తాయి. ఈ ప్రదేశం 2012 సంవత్సరంలో డిస్కవరీ ఛానెల్ వారిచే ప్రపంచంలో 10 అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది.
ప్రయాణించే రాళ్లు లేక నడిచే రాళ్లుగా పిలువబడే ఈ రాళ్లు మానవుల జోక్యం లేక ఎటువంటి పరికరాలు లేకుండానే నడుస్తాయి. 2004 లో శాస్త్రవేత్తలు వీటి రహస్యం కనిపెట్టేదాకా ఇది ఒక వింతగానే మిగిలి పోయింది. శాస్ర్తవేత్తలు వీటికి కెమెరాలు బిగించి వీటి రహస్యాన్ని కనుగొన్నారు.
శీతాకాలపు చెరువులు ఎండాకాలంలో ఎండిపోవటం వలన వాటిలో ఉన్న ఈ పెద్ద రాళ్బయటబడతాయి. కానీ ఈ రాళ్లకింద మందంగా ఉన్న మంచుపొరలు కరగకుండా అలాగే ఉంటాయట. బలమైన గాలులు వీచినపుడు ఈ రాళ్లకింద ఉన్న మంచుపలకల కారణంగా ఇవి ఒక నిమిషానికి 5 మీటర్లు ప్రయాణిస్తాయని శాస్ర్తవేత్తలు తేల్చి చెప్పారు.