Ramajanmabhoomi, Ayodhya..

Ramajanmabhoomi, Ayodhya...భారతీయులు శతాబ్ధాలుగా ఎదురుచూస్తున్న రామజన్మ భూమి హక్కు ......10 రోజుల్లో అయోధ్య తీర్పు...చీఫ్ జస్టిస్ రంజన్ గోయ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసుపై 40 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. అయోధ్యలో రామజన్మభూమిగా చెబుతున్న 2.77 ఎకరాల భూమి హిందువులదా..? ముస్లింలదా...? అన్నది వివాదం.
ఈ స్థలాన్ని 2010 సెప్టెంబర్ 30వ తేదీన మూడు సమాన భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ లక్నో బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాముడి విగ్రహం ఉన్నచోటు (గుమ్మటం ఉన్నచోటు) హిందువులకు, చామ్ ఛబుత్రా, సీతా రసోయీలను నిర్మోహి అఖాడాలకు, మిగతా భాగం ముస్లింలకు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది.
కానీ ఈ తీర్పును సవాలు చేస్తూ 14 అపీళ్లు ధాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచింది.