ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాలలో 591 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. లోతుగా వున్న లోయలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు పులులు, చీతల్, నీగాయ్, సాంబార్ జాతికి చెందిన జింకలు, దుప్పులు, నక్కలు, అడవి కుక్కలు, హైనాలు, అడవి పందులు.
వృక్షజాతులు : వెదురు, టేకు, రక్తచందనం, విప్పపువ్వు చెట్లు ఈ అటవీ ప్రాంతంలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 50 కి.మీ. దూరంలో కలదు
వసతి సౌకర్యం : రాజమండ్రి, మారేడుమిల్లి, కన్నాపురంలో అటవీశాఖవారి అతిధిగృహాలు కలవు
అక్టోబర్ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.
ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో 235.7 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. సముద్రతీర ప్రాంతాలో పెరిగే 65 రకాల తెల్లమడచెట్లకు స్థావరం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నీటికుక్కలు, ఒక జాతి మొసళ్ళకు, చేపలు పట్టే పిల్లలకు సురక్షిత ప్రాంతం. నక్కలు, సముద్రపు తాబేళ్ళు, బాతులు, ఫ్లెమింగో జాతి పక్షులు, సముద్రపు కాకులు, ఉల్లంగి పిట్టలు
ఒకప్పుడు సముద్ర వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కోరింగ.. ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కనుమరుగైన ఈ పోర్టు తిరిగి కోరింగ అభయారణ్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
235.7 చదరపు కిలోమీటర్లు విస్తరించిన మడ అడవులు.. కోరింగను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా నిలబెట్టాయి. పక్షులు, జంతువులు, జలచరాలు.. ఈ వనాన్ని జీవవైవిధ్యానికి ఆవాసంగా మార్చాయి. 1998లో అభయారణ్యంగా
ప్రకటించిన తర్వాత కోరింగ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. చిరుజల్లుల వేళ.. సుందరవనాలు (మడ అడవులు) మరింత మనోహరంగా కనిపిస్తాయి.
వలస పక్షుల విడిదిగా కోరింగ విలసిల్లుతోంది. శీతాకాలంలో 239 జాతులకు చెందిన సుమారు 88 వేల పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడికి వస్తుంటాయి. గౌరు కాకులు, హిమాలయాల్లో ఉండే బ్రాహ్మణి కైట్, స్టార్క్ కొంగలు, కింగ్ఫిషర్ పక్షులు ఎక్కువగా వలస వస్తాయి.
గోదావరి, సముద్రం సంగమించే ఈ ప్రాంతమవ్వడంతో ఇక్కడి తీపి, ఉప్పు కలయికతో మిశ్రమ లవణ సాంద్రత ఉంటాయి. అందుకే ఈ నీటిలో విభిన్న జాతులకు చెందిన జలచరాలు మనుగడ సాగిస్తున్నాయి. 575 రకాల చేప జాతులను గుర్తించారు.
చిత్తడి నేలలో మండపీతలు, పాములు అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ఎలుకలు కూడా పక్షులతో పోటీగా చెట్లపై గూళ్లు కట్టుకోవడం విశేషం. కోరింగ పరిధిలో ఉన్న 32వ నీటిపాయ లోనికి వెళ్తే చెట్లపై ఎలుకలు కట్టుకున్న గూళ్లు కనిపిస్తాయి.
వృక్షజాతులు : కోరింగ వనాల్లో.. 35 రకాల మడజాతి వృక్షాలు ఉన్నాయి. నల్లమడ, తెల్లమడ, బిల్లమడ వృక్షాలు కనిపిస్తాయి. వనంలో నీటి కుక్కలు, నీటి పిల్లులు, బంగారురంగులో ఉండే నక్కలను చూడొచ్చు. చొల్లంగి గ్రామం దగ్గర
అభయారణ్యానికి ప్రవేశం ఉంటుంది. కోరింగ గ్రామంలో మ్యూజియం, వసతి సముదాయాలు ఉన్నాయి. మడ అడవుల్లోని 32వ క్రీకు (నీటిపాయ)లో వివిధ రకాల పక్షి జాతులను వీక్షించే ఏర్పాట్లు ఉన్నాయి. కిందంతా చిత్తడి నేల ఉండటంతో
నడవడం సాధ్యం కాదు. అందుకే అడవిలో విహరించడానికి చెక్క వంతెన ఏర్పాటు చేశారు. నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనపై కాలినడకన విహరిస్తూ.. వన సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. క్రీకులో ప్రయాణించడానికి జెట్టీలు ఏర్పాటు చేశారు.
200 ఏళ్ల కిందటి పాతలైట్ హౌస్ను ఇటీవలే అభివృద్ధి చేశారు. యాత్రికులు బోట్లో వెళ్తారు. హోప్ ఐలాండ్ ఇక్కడ మరో ఆకర్షణ. నిండైన పచ్చదనంతో అలరించే ఈ ద్వీపానికి బోట్లలో చేరుకోవచ్చు.
ఎలా వెళ్ళాలి : కాకినాడ రైల్వేస్టేషన్ నుండి 20 కి.మీ. రాజమండ్రి రైల్వేస్టేషన్ నుండి 70 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : రాజమండ్రి, కాకినాడలో ఉండవచ్చు
అక్టోబర్ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.
Divisional Forest Officer, (Wildlife Management), Rajahmundry, East Godavari District.
Phone:- 0883-2478643, Forest Range Officer, Kakinada, Phone:-0884 2367460.
ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో 194.81 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. తెల్లమడచెట్లు పెరుగుతాయి.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు నీటికుక్కలు, ఒక జాతి మొసళ్ళుకు, చేపలు పట్టే పిల్లలకు సురక్షిత ప్రాంతం.
వృక్షజాతులు : కొన్ని రకాల తెల్లమడచెట్లు ఈ అటవీ ప్రాంతంలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి ? : విజయవాడ రైల్వే స్టేషన్ నుండి 80 కి.మీ. రోడ్డు మార్గం. గుంటూరు జిల్లాలోని రేపల్లె నుండి 25 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : విజయవాడ మరియు గుంటూరు జిల్లాలోని అటవీశాఖవారి అతిధి గృహాలలో ఉండవచ్చు.
అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పర్యటనకు అనుకూలం.
ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం గుంటూరు, ప్రకాశం, కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలో వ్యాపించియున్నది.కొండలు, లోతైన లోయలు, అరణ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సముద్రతీర ప్రాంతాలలో పెరిగే 65 రకా తెల్లమడచెట్లకు స్థావరం.
జంతువులు: ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు పులులు, నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, పెద్ద ఉడుతలు, నెమళ్ళు, రకరకా జింకలు, అడవి పందులు, మొసళ్ళు, రాతినేలలో ఉండే కొండచిలువలు,
వృక్షజాతు : టేకు, వెదురు, సిరిమాను చెట్లు, కరక్కాయ చెట్లు, ఈ అటవీ ప్రాంతంలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్ నుండి 130 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : నాగార్జునాసాగర్, మాచెర్ల, మార్కాపూర్, ఆత్మకూర్‌లో ఉండవచ్చు
అక్టోబర్ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.
ఈ వన్యప్రాణుa రక్షితకేంద్రం కర్నూలు జిల్లాలో 6.14 చ.కి.మీ. పరిధిలో వ్యాపించియున్నది. భారతదేశపు బస్టర్డ్ అనే 3 అడుగుల ఎత్తు ఉండి ఎగిరే పక్షులో భారీ పక్షిగా పేరు పొందిన పక్షులకు రక్షితకేంద్రం.
జంతువులు : నల్ల దుప్పులు, తోడేళ్ళు, నక్కలు, ఎర్రముఖంతో ఉన్న కోతులు, నాగుపాములు, పాములు
వృక్షజాతులు : దట్టమైన ముళ్ళపొదతో ఉండే గడ్డి ప్రదేశాలతో ఉంటుంది.
ఎలా వెళ్ళాలి : కర్నూలు నుండి 45 కి.మీ. దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : కర్నూలు అటవీశాఖ అతిధిగృహాంలో ఉండవచ్చు. నందికొట్కూరు బంగళాలో ఉండవచ్చు
అక్టోబర్ నుండి ఏప్రియల్ వరకు పర్యటనకు అనుకూలం