Cesarean surgery( C Section)/ సిజేరియన్ సర్జరీ గురించి..
డాక్టర్ మాధవీ రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్
రెయిన్ బో చిల్ర్డన్స్ హాస్పటల్స్ అండ్ బర్త్ రైట్, సికింద్రాబాద్
డజన్ల కొద్దీ పిల్లలను కన్న అమ్మమ్మల కాలంలో సిజేరియన్ సర్జరీలు లేవు. అప్పట్లో సుఖప్రసవాలు ఎలా సాధ్యపడేవి? .....
మారుతున్న జీవన శైలుల కారణంగా, గాడితప్పుతున్న శారీరక అనారోగ్యాలే కారణమంటున్నారు వైద్యులు
ఏ సందర్భాలలో సిజేరియన్ చేస్తారు ?..
గర్భిణిలకు, డాక్టర్లకు ఇద్దరికీ సిజేరియన్ కంటే సుఖప్రసవమే సులువు. అయితే కొన్ని అత్యవసర సందర్భాలలో తల్లీ బిడ్డల క్షేమం కోసం సిజేరియన్ ఒక్కటే ప్రత్యామ్నయం కావచ్చు. అ సందర్భాలు..
గర్భంలో బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నప్పుడు...
తొమ్మిది నెలలు నిండినా బిడ్డ తలక్రిందులవకుండా అడ్డంగా ఉండిపోయినప్పుడు........
మొదటి కాన్పు సాధారణమై, రెండోసారి బిడ్డ అడ్డం తిరిగినప్పుడు.......
ప్రసవం జరిగే వీలు లేకుండా మాయ అడ్డుపడ్డపుడు.....
అంతకు ముందు జరిగిన సిజేరియన్ వలన మాయ అతుక్కుపోయి ఉన్నా...
బిడ్డకు రక్తప్రసరణ తగ్గిపోయినా..........
కవలపిల్లలలో మొదటి బిడ్డ ఎదురు కాళ్లతో ఉన్నా....
మొదటి కాన్పు సిజీరియన్ అయి ఉండి రెండో సారి నొప్పులు రాకపొయినా...
గర్భద్వారం తగినంతం ఓపెన్ అవకపోయినా, కొంతవరకు తెరచుకొని మధ్యలో ఆగిపోయినా...
బిడ్డ మలవిసర్జన చేసి అది బిడ్డ ఊపిరి తిత్తులలోకి చేరే ప్రమాదం ఉన్నా లేక ప్రసవ సమయంలో బిడ్డ గుండె కొట్టుకొనే వేగం తగ్గిపోయినా...
ఇద్దరికంటే ఎక్కువ కవలలు గర్భంలో ఉన్నప్పుడు..
సిజేరియన్ తరువాత రక్తస్రావం ఏ మేరకు......
సాధారణ ప్రసవం, సిజేరియన్ ఏది జరిగినా గర్భాశయం సాధారణ సైజుకి చేరుకోవటానికి ఆరువారాలు పడుతుంది. ఈ ఆరు వారాలు రక్తస్రావం కనిపిస్తుంది. శరీర తీరును బట్టి కొందరిలో రక్తస్రావం అంతకంటే ముందే ఆగిపోతే, ఇంకొందరిలో ఆరువారాలపాటు కనిపించవచ్చు. అయితే నార్మల్, సిజేరియన్ ఏ ప్రసవమైన తర్యాతి రెండు రోజులు బ్లీడింగ్ కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లీడింగ్ తీవ్రత కొంత ఎక్కవగా ఉంటుంది. ఈ బ్లీడింగ్ తీవ్రత కొంత ఎక్కువగా ఉండి ప్రతి మూడు గంటలకొకసారి ప్యాడ్ మార్చాల్సి రావచ్చు. ఇది సహజం. ఇలా కాకుండా పంపు తిప్పినట్టు రక్తం పోతున్నా, అరగంట వ్యవధిలోనే ప్యాడ్ మార్చాల్సి వచ్చినా, పెద్ద పెద్ద రక్తపు గడ్డలు కనిపించినా అసాధారణంగా భావించి వెంటనే వైద్యులను కలవాలి.
ప్రమాదకర లక్షణాలు...
సిజేరియన్ తరువాత ఇంటికి చేరుకున్న తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను కలవాలి.
తీవ్రమైన జ్వరం...
వాసనతో కూడిని డిశ్చార్జ్.....
లావుపాటి రక్తపు గడ్డలతో కూడిన రక్తస్రావం...
పొత్తికడుపులో తట్టుకోలేనంత నొప్పి...
విపరీతమైన రక్తస్రావం.....
కోతపెట్టిన ప్రదేశంలో ఇన్ ఫెక్షన్
Next Page......తరువాత పేజీలో..Cesaraen Surgery