telugukiranam

Bhutan Tourism భూటాన్ పర్యాటకం

Bhutan Tourism భూటాన్ పర్యాటకం
bhutan tourism డోకులా పాస్....
థింపూ నుంచి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉండే డోకులా పాస్.. సముద్రమట్టానికి 10,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒకే చోట నిర్మించిన 108 స్మారక స్తూపాలు. 2003లో తిరుగుబాటుదారుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగానికి గుర్తుగా వీటిని నిర్మించారు. ఇక్కడి రాయల్ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుష్పాలు, ఫలాలు చూడవచ్చు.
సందర్శనకు అనుకూలమైన సీజన్..
అక్టోబర్, నవంబర్ నెలల్లో భూటాన్కు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. మళ్లీ వేసవి అనుకూలంగా ఉంటుంది. మార్చి రెండో వారం నుంచి మళ్లీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 9 డిగ్రీలు నమోదవుతుంది. వేసవిలో భూటాన్ విహారం ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోతుంది.
భూటాన్ సాంకేతిక పరంగా అభివృద్ధి సాధించలేదు. స్మార్ట్ ఫోన్లు మాత్రం అందరి చేతులలో ఉంటాయి. టి.వి కూడా 1999లోనే మొదలైంది.
ప్రయాణ సౌకర్యాలు...
భూటాన్ సందర్శనకు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు బోలెడన్ని ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వారం రోజుల పాటు ఉన్న ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీల ధరలు ఒక్కొక్కరికి రూ.17,000 నుంచి రూ.75,000 వరకు ఉండవచ్చు.
విమానాల ద్వారా...
కోల్కతా, దిల్లీ నుంచి పారోకు విమాన సర్వీసులు ఉన్నాయి. పారో చేరిన తర్వాత విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో అనుమతి తీసుకోవాలి. కనీసం అరునెలల గడువున్న పాస్పోర్టు, ఓటర్ ఐడీ కార్డు గానీ, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం ఉండాలి. పారో, థింపూ నగరాలతో పాటు భూటాన్ అంతా చుట్టిరావాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి బౌద్ధ ఆలయాలు సందర్శించడానికీ.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనుమతి ‘టెంపుల్ పర్మిట్’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతులన్నీ టూర్ ఆపరేటర్లే ఏర్పాటు చేస్తారు. భారత్ రూపాయి భూటాన్ రూపాయితో సమానం. ఇమ్మిగ్రేషన్ కేంద్రంలోనే మన రూపాయిలను భూటాన్ కరెన్సీగా మార్చుకోవాలి.
రోడ్డు మార్గం....
భూటాన్కు రోడ్డు మార్గంలో కూడా వెళ్లొచ్చు. ముందుగా కోల్కతా చేరుకోవాలి. నగరంలోని సిల్ధా రైల్వే స్టేషన్లో కాంచన్కన్యా ఎక్స్ప్రెస్ (ప్రతిరోజూ రాత్రి 8.30) ఎక్కి హాసిమారాలో దిగాలి. హాసిమారా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఇండో- భూటాన్ సరిహద్దు ఉంటుంది. ట్యాక్సీలు ఉంటాయి. ఒక్కొక్కరికి రూ.150 నుంచి రూ.200 తీసుకుంటారు.
సరిహద్దు దాటిన తర్వాత.. అక్కడే ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఉంటుంది. పాస్పోర్ట్తో పాటు ఓటర్ ఐడీ లేదా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం అధికారులకు చూపిస్తే వీసా జారీ చేస్తారు. ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి దగ్గరలోనే నార్గేలామ్ గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి పారో, థింపూ నగరాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.