telugukiranam

Egypt Tourism….ఈజిప్ట్ పర్యాటకం.....

Turkey Tourism / టర్కీ పర్యాటకం
ఎడ్ఫు ఆలయం
గద్ద ముఖం, మనిషి శరీరంతో గల హోరస్‌ దేవతకు చెందిన ఆలయం ఇది.ఇక్కడి ఆలయాలన్నీ ముందు భాగం వెడల్పుగానూ ఎత్తుగానూ లోపలికి వెళ్లే కొద్దీ వెడల్పూ ఎత్తూ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ కుడ్యాలనూ స్తంభాలను చూస్తే ఔరా అనిపించక మానదు. గోడలమీద అప్పట్లోనే ఆపరేషన్లకు అవసరమైన వస్తు సామగ్రినీ కాన్పు సమయంలో తల్లిని కూర్చోబెట్టిన దృశ్యాలనూ చూడవచ్చు.
లక్సర్‌ పట్టణం

ఇది ఫారోల రాజధాని నగరం. ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి నాలుగు. మార్చురీ టెంపుల్‌ ఆఫ్‌ హాట్సెప్పట్‌, కార్నక్‌ టెంపుల్‌, వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌, లక్సర్‌ ఆలయాలు. హాట్సెప్సట్‌ టెంపుల్‌ ఓ సూర్యదేవాలయం. ఈ ప్రదేశంలో దొరికిన శిథిలాలతో దీన్ని పునర్నిర్మించారు. ఇందులోని వర్ణచిత్రాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వేల సంవత్సరాలు గడిచినా ఎండకు ఎండినా రంగులు మాత్రం వెలసిపోలేదు.
వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌....
ఈజిప్టుని పాలించిన ఫారో చక్రవర్తులు మరణానంతర జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకోసం భారీ యెత్తున నిర్మించిన పిరమిడ్లు వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ లో చూడవచ్చు. క్రీ.పూ. 1069 నాటికి క్రమంగా సమాధులు నిర్మించటం ప్రారంభించబడింది . పిరమిడ్‌లలో ఉంచిన మమ్మీలనూ సంపదలనూ దుండగులు కొల్లగొడుతుండటమే దీనికి కారణం కావచ్చుంటారు. ఈ భూభాగమే సహజసిద్ధంగా ఏర్పడిన పిరమిడ్‌ ఆకారంలో ఉంటుంది. ఫారోలు తాము జీవించి ఉండగానే తమ అభిరుచికి అనుగుణంగా తమ సమాధులని ఇక్కడ తీర్చిదిద్దుకున్నారు. వీటిలో టూటన్‌కామెన్‌ సమాధి ఒకటి. కైరో మ్యూజియంలోని మమ్మీలన్నీ ఇక్కడ బయటపడినవే. ప్రస్తుతం ఈ వ్యాలీలో కేవలం మూడింటిలోకే ప్రవేశం ఉంది. భూమిలోపలి పొరల్లో గుహలుగా తొలిచి ఇవి నిర్మించబడ్డయి.
అద్భుత కుడ్యచిత్రాలతో కూడిన టూటన్‌కామెన్‌ సమాధి అతని మమ్మీని చూడవచ్చు. ఆ సమాధిలో అనేక వస్తువులతోబాటు బంగారు తొడుగూ టూటన్‌కామెన్‌ మమ్మీ బయటపడ్డాయట. మమ్మీనీ, చెక్క శవపేటికనీ సందర్శనకు ఇక్కడ ఉంచి మిగిలిన సంపదను కైరో మ్యూజియంకు తరలించారు.
లక్సర్‌ ఆలయం
ఇది 66 ఎకరాల్లో నిర్మించిన 132 భారీ స్తంభాల సముదాయం. ఇక్కడ రహదారికి ఇరువైపులా మానవశరీరం పొట్టేలు ముఖం కలిగిన విగ్రహాలున్నాయి.
ఈజిప్ట్ లో ఇంకా చూడవలసినవి :
Alexandria, Siwa Oasis, Westeran Sahara Desert, Karnak Temple Complex, Temple Philae, Temple of Sobek NS Horus Nile River Cruises