దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 322 ద్వీపాల సమూహం ఫిజీ. ఆస్ట్రేలియా ఖంఢానికి చెందిన దేశం ఫిజి. ఫిజి రాజధాని సువా. వీరి ద్రవ్యం ఫిజియన్ డాలర్స్. మన రూ.34తో సమానం.(2019) వీరి అధికార భాష ఇంగ్లీష్. భారతీయులు ఎక్కువగా గల క్రిస్టియన్ దేశం ఫిజి
హనీమూన్ డెస్టినేషన్‌గా, సాహసక్రీడలకు పేరొందిన ఫిజీలో పర్యాటకం ఆనందంగా ఉంటుంది. ఆస్ట్రేలియా ఆవల ఉండే ఫిజీలో భారతీయుల జనాభా దాదాపు 38 శాతం. ఆంగ్లేయుల కాలంలో చెరకు సాగు కోసం వెళ్లిన భారతీయ కూలీలు.. క్రమంగా పెరిగిపోయారు. భారతీయులు మాత్రమే కాదు.. మనం ఆరాధించే దైవాలూ అక్కడ కొలువైనారు. సుబ్రహ్మణ్యస్వామి, రాముడు, గంగ, నాగదేవత తదితర దేవుళ్లకు అక్కడ ఆలయాలు కట్టబడ్డాయి.
వీటిలో ఫిజీలోని ప్రముఖ నగరం నాడిలో ఉన్న శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొండల నడుమ అందంగా ఉంటుంది. ఫిజీ వెళ్లే పర్యాటకులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఫిజీ ప్రభుత్వం నటి ఇలియానాను పర్యాటక అంబాసిడర్‌గా నియమించింది. అందమైన సముద్ర తీరాలు, ఆశ్చర్యపరిచే జలక్రీడలు ఇక్కడికి వచ్చే పర్యాటకులనుక్షణం తీరిక అలరిస్తాయి. సర్ఫింగ్, బోటింగ్, రాఫ్టింగ్ విన్యాసాలకు ఫిజీ దీవులు వేదికగా నిలుస్తున్నాయి.
ఫీజీ దీవుల పర్యటనకు అనుకూల సమయం నవంబరు నుండి ఏప్రిల్ వరకు
భారతీయ రుచులకు ఇబ్బంది లేదు. దేశవిదేశాలకు చెందిన వంటకాలు ఆస్వాదించవచ్చు.
ఎలా వెళ్లాలి ?... ముంబయి నుంచి ఫిజీ రాజధాని సువా, నాడీకి విమానాల ద్వారా వెళ్లవచ్చు.
ప్యాకేజీలు: చాలా పర్యాటక సంస్థలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిపి ఫిజీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్యాకేజీల ధరలు సుమారు రెండు లక్షల నుంచి మొదలవుతున్నాయి.(20190
ఫిజీలో చూడాల్సినవి....ఫిజీ రాజధాని సువా, నాడి నగరాలు, హైక్ బౌమా హెరిటేజ్ పార్క్ (ప్రకృతి ఒడిలో కొలనులు, జలపాతాలు అలరిస్తాయి), లౌటోకా సుగర్ సిటీ -చక్కెర కర్మాగారాలకు ప్రత్యేకం, లెవుకా నగరం, స్లీపింగ్ గెయింట్ ఉద్యానవనం, శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయం