telugukiranam

Jordan Tourism…జోర్డాన్‌ పర్యాటకం

Jordan Tourism…జోర్డాన్‌ పర్యాటకం
ఉన్నతమైన సంస్కృతితో అలరారే దేశంలో ఆధునికతల మేళవింపులకు చిరునామా జోర్డాన్. పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్‌ పర్యాటక దేశంగా పేరు పొందింది. జోర్డాన్ రాజదాని అమ్మన్. వీరి అధికార భాష అరబ్. జోర్డాన్ దీనార్స్ వీరి ద్రవ్యం(ఒక దీనార్ మన రూ.100తో సమానం). జోర్డాన్ ముస్లిం దేశం కానీ పర్యాటకంగా పేరు పొందింది.
ప్రాచీన నాగరికత, ఈజిప్ట్‌, రోమ్‌ రాజ్యాల ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కనిపిస్తాయి.. సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధులు, జోడు మూపురాల ఒంటెలు, రాతికట్టడాలు, మృత సముద్రం.. ఇవన్నీ జోర్డాన్‌ను పర్యాటకటంగా ప్రత్యేకం నిలబెట్టాయి. జోర్డాన్‌ రాజధాని అమన్‌ ప్రధాన పర్యాటక కేంద్రం. రోమన్ల ఏలికలో నిర్మించిన అపురూప కట్టడాల శిథిల సౌందర్యం చారిత్రక ప్రియులను కట్టిపడేస్తుంది. అమన్‌ నుంచి వివిధ పర్యాటక కేంద్రాలకు సులభంగా వెవచ్చు.
ఇక్కడి నుంచి మృత సముద్రానికి బస్సుల్లో వెళ్లచ్చు. లవణ సాంద్రత అధికంగా ఉన్న ఈ డెడ్‌ సీలో అలలపై అలా అలా తేలిపోవచ్చు. కేవలం ఈ అద్భుతాన్ని ఆస్వాదించడానికి మాత్రమే జోర్డాన్‌ వచ్చే పర్యాటకులు ఉన్నారు.
ఈ దేశంలో మరో అద్భుతం పెట్రా. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పురుడు పోసుకున్న ఈ నగరంలోని అపురూప కట్టడాలు నేటికీ ఆశ్యర్యపరుస్తాయి. ఇంకామ విశేషాలు మరెన్నో ఉన్నాయి జోర్డాన్ లో.
జోర్డాన్ పర్యటనలకు అనుకూల సమయం: సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి
ఆహారం: భారతీయ రెస్టారెంట్లు ఉంటాయి. మసాలా పాళ్లు ఎక్కువగా ఉండే జోర్డాన్‌ వంటకాలు కూడా భోజనప్రియులను అలరిస్తాయి. హైదరాబాద్‌, ముంబయి, అహ్మదాబాద్‌, దిల్లీ, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ ఆపరేటర్లు జోర్డాన్‌, జోర్డాన్‌తో పాటు ఇతర దేశాల ప్యాకేజీలు నిర్వహిస్తున్నాయి. రూ.75,000-రూ.1.20 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటాయి.
జోర్డాన్ లో చూడవలసినవి మృత సముద్రం , పెట్రా రాతి కట్టడాలు, అంపీ థియేటర్‌, షౌమరీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వాడిరం డెజర్ట్‌ క్యాంప్‌, అమన్‌ సిటాడెల్‌