telugukiranam

Laos Tourism…లావోస్.... పర్యాటకం...

Laos Tourism…లావోస్.... పర్యాటకం...
అగ్నేయ ఆసియా లావోస్ చిన్న దేశం. పర్వతాలతో నిండిన దేశం. లావోస్ రాజధాని వియెంటినే. వీరి భాష లావు. వీరి కరెన్సీ కిప్. ఈ దేశంలో 58 శాతం మంది బౌద్ధ మతస్థులే. తక్కువ ఖర్చుతో ఈ దేశాన్ని సందర్శించవచ్చు.
లావోస్ లో మౌలిక వసతులు తక్కువే కానీ పర్యాటక దేశంగా పేరుపొందింది. చిక్కటి పచ్చదనం, కొండలు, గుట్టలు, నదులు, జలపాతాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
బౌధ్ధ ఆరామాలు ప్రశాంతంగా ఉంటాయి. ట్రెక్కింగ్, ర్యాపెలింగ్ చేయవచ్చు. హానీమూన్ జంటలు ప్రకృతి సౌందర్యాన్సి ఆస్వాదించవచ్చు.
లావోస్ రాజధాని వెంటియాన్ లో శతాబ్ధాల నాటి కట్టడాలను చూడవచ్చు. లునాంగ్, వాంగ్ వియాంగ్, పాక్సే నగరాలకు పర్యాటకులు ఎక్కువగా వెళుతుంటారు.
రిసార్టులు, హోటల్ గదుల అద్దెలు తక్కువగా ఉంటాయి. మంచి ఆతిధ్యం లభిస్తుంది. శాఖాహారం, భారతీయ వంటకాలు లభిస్తాయి.
వాంగ్ వియాంగ్ ప్రాంతంలో ఉన్న నామ్ సాంగ్ నదిలో ట్యూబ్ రైడింగ్ ప్రత్యేకం. నీటి ప్రవాహంపై ట్యూబ్ తేలిపోతుంది.
లునాంగ్ ప్రభాంగ్ దగ్గరలోని కుంగ్ సీ జలపాతం అందాలను చూడాల్సిందే. కొండల మధ్య మొట్లు మెట్లుగా ఉన్న కొలను మీదుగా దూకే జలధారలు కనువిందుచేస్తాయి.
వెంటియాన్ లో బౌద్ధ ఉద్యానవనం, బౌద్ధ ఆరామాలు చూడదగ్గ ప్రదేశాలు
పాక్సే నగరం దగ్గర శిధిలమైన హిందూ దేవాలయం వాట్ ఫో ను చూడవచ్చు.
కము గ్రామ పరిసరాలలోని కొండవాలులో ఉండే పంటపొలాలు ఓ ప్రత్యేక ఆకర్షణ