విదేశాల్లో బడ్జెట్ విహార కేంద్రం మాల్దీవులు. అడవులు ఎక్కువగా ఉన్న మాల్దీవులు ద్వీప సమూహాలివి. చిన్నా చితకా సుమారు వెయ్యి దాకా ఉంటాయి. మాల్దీవుల రాజరాధాని మాలే. ఈ దీవులు ఆసియా ఖండంలో ఉన్నాయి. వీరి కరెన్సీ రూఫియా. ఇది ముస్లిం మతానికి చెందిన దేశం.
సుమారు 200 దీవుల్లో జనావాసాలున్నాయి! వీటిలోనే . పగడపు దిబ్బలు, ప్రశాంత తీరాలు కొత్త దంపతుల విహార కేంద్రాలు. సముద్రతీరంలో ఉన్న పెద్ద పెద్ద రిసార్టులు, సముద్రంపైనే నిర్మించిన కాటేజీల్లో బస ఉత్సాహంగా ఉంటుంది.
స్పా సెంటర్లు అలసటను మరిపిస్తే.. సాహస క్రీడా కేంద్రాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. రుచులకు మాల్దీవులు పెట్టింది పేరు. అంతర్జాతీయ వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయి.
ఈ దీవులకు పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. మాల్దీవులు వెళ్లాక వీసా ఆన్ అరైవల్ తీసుకోవచ్చు.
మాల్దీవులు రాజధాని మాలెలో దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. రిసార్టులు, బీచ్‌లు, చుట్టుపక్కల దీవులు చూసిరావొచ్చు.
కోమో కొకోవా, బారోస్, మిరిహి, గిలి లంకన్‌పుషి, వెలిగండు తదితర దీవుల్లో కడలిపై నిర్మించిన వుడెన్ రిసార్టులు ఘనమైన ఆతిథ్యాన్నిస్తాయి.
రంగాలి ద్వీపంలో అండర్‌వాటర్ రిసార్టులో విడిది ఎప్పటికీ మరచిపోలేం.