telugukiranam

Kailash and Mansarovar Tourism /మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర

Kailash and Mansarovar Tourism /మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర
రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా కనిపిస్తారనీ పురాణాల్లో చెబుతుంటారు. ఈ సమయంలో చూస్తే సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపిస్తాయి.
తరువాత చూడవలసినది కైలాస పర్వతం ఈ దారిలో యమ ద్వారం వస్తుంది. ఇక్కడ వచ్చిన వారు అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపిస్తుంది. పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ కనిపించదు. ఎంతో చిత్రంగా అనిపిస్తుంది.
కైలాస పర్వతం చుట్టూ పరిక్రమణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌... వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయంటారు.
కైలాసగిరి. ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు, టిబెట్‌లోని ప్రధాన మతాచారమైన బోన్‌లకు, జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది. ప్రపంచ దేశాల నుంచి ఏటా వేలమంది యాత్రికులు, పర్యాటకులు కైలాస, మానస సరోవర సందర్శనకు వస్తుంటారు.
మానససరోవరం చూడాలంటే ఆరోగ్యవంతులై ఉండాలి. అక్కడి వాతావరణానికి తట్టుకోవాలి. 4000 మీటర్ల ఎత్తులో శ్వాస అందటం కష్టంగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి రావచ్చు. డాక్టర్ సలహాతో మందులు దగ్గర ఉంచుకోవటం తప్పనిసరి
పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా కైలాస పర్వత పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌... అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వంవారు నిర్వహించే అన్ని శారీరక వైద్య పరీక్షలలో నెగ్గాలి. ఉబ్బసం, సైనస్, అంగవైకల్యం, గుండెజబ్బులు, మధుమేహం ఉన్నవారిని అనుమతించరు.
కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా కైలాస యాత్ర జరుగుతుంది.
పాస్‌పోర్టు, ఫొటోలు, ఇతర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. జూన్‌లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు ముగుస్తుంది. యాత్రికులను కంప్యూటర్‌ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. రూ. 1,60,000 చెల్లించాలి. మొత్తం ఖర్చు రూ.2 లక్షలు దాటుతుంది. (2018)
ప్రైవేటు యాత్రా సంస్థలు కైలాసయాత్ర మొదలుపెట్టాక యాత్రికుల సంఖ్య పెరిగింది. వీరు ఎక్కువగా నేపాల్‌ మీదుగా యాత్ర నిర్వహిస్తుంటారు. ప్యాకేజీ ధరలు రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఉన్నాయి.
అన్ని యాత్రలలాగే మానస సరోవరం వెళ్లాలంటే కుదరదు. తప్పనిసరిగా పాస్ పోర్ట్ ఉండాలి. ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. చైనా ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి. ఈ అనుమతులు యాత్రా నిర్వాహకులు లేక ప్రభుత్వం వారే తీసుకుంటారు. భారతప్రభుత్వం వారు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఈ యాత్రలు నిర్వహిస్తారు. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారత ప్రభుత్వం ద్వారా వెళ్లాలంటే పూర్తి వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. లేక మీకు దగ్గరలోని యాత్రా నిర్వాహకులను సంప్రదించండి.
How to apply Manasarovar-Click here