telugukiranam

Singapore Tourism /సింగపూర్ పర్యాటకం

Singapore Tourism /సింగపూర్ పర్యాటకం

వన విహారం!
అరుదైన వృక్షజాతుల్నీ జీవజాతుల్నీ చూడాలనుకునే వాళ్లకి చాంగి ఎయిర్పోర్టు ఓ చూడచక్కని వేదిక. దాదాపు 250 జాతులకు చెందిన ఐదు లక్షల మొక్కలు అక్కడ కనువిందు చేస్తుంటాయి. ముళ్లమొక్కల కాక్టస్ గార్డెన్, తామరపూల కొలను, ఆర్కిడ్ వనం, జలపాతాలతో కూడిన వర్షారణ్యం, పొద్దుతిరుగుడు పూలతోట...
ఇలా పలు రకాల ఉద్యానవనాల్లో హాయిగా విహరించవచ్చు. సీతాకోకచిలుకలకూ అక్కడో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. అందులో సింగపూర్ జాతీయ కీటకమైన రోజ్ బటర్ఫ్లైతోబాటు నలబై జాతులకు చెందిన ఇతర సీతాకోకచిలుకలు ఎగురుతుంటాయి.
ప్రకృతి అందాలకి సాంకేతిక పరిజ్ఞానం తోడయితే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నదానికి అక్కడి ఎన్ఛాంటెడ్ గార్డెనే ప్రత్యక్ష నిదర్శనం. అందులో ప్రధానంగా ఆకర్షించేది అక్కడున్న నిలువెత్తు పూలకుండీ. చూడగానే అది మొక్కల్ని పెంచే కుండీలా అనిపిస్తుంది కానీ, అదో ఫ్లవర్ వేజ్. బొకే ఆకారంలో గాజుతో చేసిన ఆ వేజ్లో దాదాపు రెండువేలకు పైగా టెస్ట్ ట్యూబులు అమరి ఉంటాయి. ఒక్కో ట్యూబులో తాజా పూలనీ ఆకుల్నీ ఉంచి వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ నిజంగానే అందులో మొక్కల్ని పెంచుతున్నారేమో అనిపించేలా చేస్తుంటారు. అంతేకాదు, దాని దగ్గరకు వెళ్లగానే మనిషి కదలికల్ని గుర్తించిన సెన్సర్లు, గాలిసవ్వడులు చేస్తూ పచ్చని ప్రకృతిలో విహరించిన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే అక్కడున్న కొలనులో నారింజ రంగులోని ఆర్చర్, కొయ్ చేపలూ నీళ్లలో కేరింతలు కొడుతూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి.

సాంకేతిక వినోదం!
టెర్మినల్-1లో ఏర్పాటుచేసిన సెల్ఫీ ట్రీ అంటే ప్రయాణికులకు ఎంతిష్టమో. చెట్టు ఆకారంలో రూపొందించిన ఆ పరికరం, చుట్టూ నిలువెత్తు సైజులో టచ్ స్క్రీన్ కంప్యూటర్లు ఉంటాయి. వాటి ముందు నిలుచుని సెల్ఫీ దిగగానే అది చెట్టు పైభాగంలోని డిస్ప్లే బోర్డులో కనిపిస్తూ, అందులో స్టోరయిపోతుంది. ఆ విమానాశ్రయాన్ని సందర్శించామన్న గుర్తుగా అది అక్కడ శాశ్వతంగా కనీసం ఓ వందేళ్లపాటు ఉండిపోతుందన్నమాట. కంప్యూటర్లోని ఆప్షన్ల ద్వారా సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ డిజైన్లనీ మార్చుకోవచ్చు. దీన్ని ఫేస్బుక్లోకీ పంపించుకోవచ్చు. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకోసం రెండు, మూడో టెర్మినల్స్లో నిర్మించిన థియేటర్లలో రోజంతా ఉచితంగా ప్రదర్శించే బ్లాక్బస్టర్ మూవీలన్నింటినీ చూడొచ్చు. కంప్యూటర్ గేమింగ్ జోనుల్లో ఎంతసేపయినా ఆడుకోవచ్చు. ట్రాన్సిట్ లాంజ్ల్లోని ఎమ్టీవీ బూత్ల్లో ఇష్టమైన మ్యూజిక్ వీడియోలను చూడొచ్చు.
ఇక, షాపింగుమాల్స్ సరేసరి. విమానం కోసం వేచి చూస్తూ లాంజ్ల్లో కూర్చున్నప్పుడు- పసిపిల్లలకు తల్లులు పాలు ఇవ్వాలన్నా డైపర్లు మార్చాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అందుకే పాపాయిలకోసం ప్రత్యేకగదులూ ఉన్నాయి. పిల్లలు విసిగించకుండానూ బోరు కొడుతుందని ఏడవకుండా హాయిగా ఆడుకునేందుకు స్లైడ్లూ, టన్నెల్సూ కూడా ఏర్పాటుచేశారు. విమానాశ్రయంలోని అన్ని టెర్మినల్స్నీ సందర్శించి రావడానికి వెంట లగేజీని తీసుకెళ్లకుండా భద్రపరిచే కౌంటర్లూ ఉన్నాయి. బడలికతో అలసిపోయి కాసేపు కునుకు తీయాలనుకునేవాళ్లకోసం స్నూజ్ లాంజ్లూ, ఎయిర్పోర్టు ట్రాన్సిట్ హోటల్లో సేదతీరే అతిథులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రూఫ్టాప్ ఈతకొలనూ... వంటివన్నీ ఈ విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో ఏడాదీ రెండేళ్లలో పూర్తయ్యేలా మరో టెర్మినల్నీ, అన్ని టెర్మినల్స్ని అనుసంధానిస్తూ ‘జ్యూయెల్ చాంగి ఎయిర్పోర్టు’ పేరుతో మరో కట్టడాన్నీ నిర్మిస్తున్నారు. అందులో సుమారు 11 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇండోర్ ఫారెస్ట్నీ, వాటర్ఫాల్నీ ఏర్పాటుచేస్తున్నారు. ‘ద రెయిన్ వోర్టెక్స్’ పేరుతో ఏర్పాటుచేస్తోన్న ఆ వాటర్ఫాల్ రాత్రి వేళల్లో రకరకాల థీమ్ల్లోని లైట్ అండ్ సౌండ్ మ్యూజిక్ ఫౌంటెయిన్గా మారిపోతూ సందర్శకుల్ని ఆహ్లాదపరుస్తుందనడంలో సందేహం లేదు.
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు, సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా డబ్బులు చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు ఇక్కడి ప్రభుత్వము పార్కింగ్ రుసుము అధికము చేయడము, అధిక కొనుగోలు పన్నులను విధించడము చేస్తుంటుంది. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. టాక్సీలలో ఎక్కువగా ఒకేరకమైన కనీస రుసుము వసూలు చేస్తుంటారు. విహార యాత్రీకుల కోసము ఆకర్షణీయమైన పైభాగము తెరచి ఉండే బస్సులను నడుపుతూ ఉంటారు.
సింగపూరు దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.గొడుగుల అవసరం ఎక్కువ కాబట్టి వీటిని దృఢంగాను ఆకర్షణీయంగానూ తయారు చేస్తారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ప్రక్క దేశమైన ఇండోనేషియా పొదలలో రేగే మంటల కారణంగా సంభవించే వాతావరణ కారణంగా ఆరోగ్య రక్షణకోసం ప్రభుత్వమునుండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూంటారు.
సింగపూర్ జనాభాలో 51 శాతము ప్రజలు బౌద్ధమత, థాయిజమ్ అవలంబీకులు. 15 శాతము ప్రజలు. క్రిస్టియన్లు, 14 శాతం ముస్లిములు వీరిలో అధిక శాతం ఇండియా ముస్లిములు. స్వల్ప సంఖ్యలో సిక్కుమత, హిందూమత, బహాయి విశ్వాము కలిగిన ప్రజలు ఉన్నారు. 15 శాతము ప్రజలు ఏ మతం అవలంబించని వారుగా గుర్తించబడ్డారు. వీరు కాక అనేక మతాలకు చెందిన దేశ సభ్యత్వము లేని ప్రజలు ఇక్కడ పనులను నిర్వహిస్తూ నివసిస్తూ ఉంటారు.
సింగపూరు జాతీయ భాష మలయ్. వారి జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది.
ఇంకా పూర్తి వివరాలకోసం .....సింగపూర్ టూరిజం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్ ను చూడండి......
http://www.visitsingapore.com/en_in.html