స్విట్జర్లాండ్ వచ్చిన సందర్శకుల్లో చాలామంది టిట్లిస్ పర్వతానికే వెళుతుంటారు
ఒకవైపు నుంచి కేబుల్ కారులో పిలాటుస్ పర్వతశిఖరంమీదకి చేరుకుని, అక్కడ నుంచి రైల్లో మరోదిశగా పర్వతం కిందకివచ్చే ఈ యాత్ర ఐదు అంచెలుగా సాగుతుంది.
మొదటి దశలో క్రియొన్స్ నుంచి క్రియెన్సెరిగ్, ఆ తరవాత ప్రాన్మున్టెగ్ వరకూ పనోరమిక్ గండోలా అని పిలిచే కేబుల్ కారులలో వెళ్లాలి.
పచ్చదనంతో నిండిన కొండలమీదుగా 45 డిగ్రీల వాలులో ఈ ప్రయాణం 25 నిమిషాలపాటు సాగుతుంది. అక్కడకు వెళ్లాక ప్రాన్మున్టెగ్ అనే నది మధ్యలో ఓ విడిది ప్రదేశం ఉంది. ఒకవైపు ఎత్తైన కొండ, మరో వైపు లోతైన లోయ, మూడోవైపుకి చూస్తే ల్యూసెర్న్ సరస్సుతో కూడిన సుందర ప్రదేశం అది. రెస్టారెంట్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి
చెట్లకాండంమీద ఏర్పాటుచేసిన చిన్న మెట్లను ఎక్కుతూ చెట్టు పై భాగానికి ఎక్కడం వింత అనుభూతిని కలిగిస్తుంది.
తరవాత సమతలంలో సమాంతరంగా కట్టిన తాళ్లలో పై దాన్ని పట్టుకుని కింది తాడుమీద నడవాలి. ఇది నిజంగా సాహసక్రీడే. ఏమాత్రం తడబడినా ప్రమాదం.
పిలాటుస్ శిఖరం మీదకి కేబుల్ బస్సులో పది నిమిషాలపాటు ప్రయాణం... దీన్నే డ్రాగన్ ప్రయాణంగా పిలుస్తారు. ఈ పర్వతం మీద మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక్కో శిఖరం సముద్రమట్టం నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
వేసవిలోనే అయినా అక్కడ ఉష్ణోగ్రత ఐదారు డిగ్రీల సెల్సియస్కు మించదు. వేసవిలో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. కొండ శిఖరం ఎక్కి చుట్టూ చూస్తే ప్రపంచాన్ని జయించినంత గర్వంగానూ ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగానూ అనిపిస్తుంది.
పిలాటుస్ పర్వతం వెనక భాగం నుంచి కోగ్ రైలుపెట్టెలో కిందకి ప్రయాణించాం. దట్టమైన చెట్లూ, సొరంగాలూ, వంతెనలూ, కొండ మలుపుల గుండా సాగే ఈ ప్రయాణం అందించే అనుభూతిని అనుభవించాల్సిందే. ప్రపంచంలోకెల్లా ఏటవాలుగా ఉండే రైలుమార్గం ఇదే. సుమారు 50 నిమిషాల రైలు విహారం
ఆల్పానాస్టెడ్ నుంచి ఓ పెద్ద పడవలో ల్యూసెర్న్ సరస్సులో ప్రయాణించడం నిజంగా అద్భుతమే. మధ్యమధ్యలో ఆగుతూ ప్రకృతి సౌందర్యాన్ని గుండెలనిండుగా నింపుకుంటూ సాగే ఈ ప్రయాణం ఆహ్లాదభరితం.
చుట్టూ పచ్చని పర్వతాలూ వాటి మధ్యలోంచి దూకే చిన్న చిన్న జలపాతాలూ మనోల్లాసాన్ని కలిగిస్తాయి.
ల్యూసెర్న్ పట్టణం...
1333వ సంవత్సరంలో చెక్కతో కట్టిన 200 మీటర్ల పొడవుగల చాపెల్మీద నడవడం ఓ వింత అనుభూతి. ఇది 1993లో అగ్నిప్రమాదంలో కాలిపోయింది. అయితే ఏడాదిలోనే దీన్ని అంతే అందంగా మరింత సురక్షితంగా నిర్మించారు. పాదచారులు ఈ వంతెనమీద నడిచేటప్పుడు పై కప్పు కింద ఒకదాని తరవాత ఒకటి వరసగా అమర్చిన 30 తైలవర్ణ చిత్రపటాలు ల్యూసెర్న్ చరిత్రనూ క్యాథలిక్ ల సంస్కృతినీ తెలియజేస్తాయి.
ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా మరణించిన స్విస్ గార్డుల స్మృత్యర్థం దీన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. కొండకి దిగువ భాగంలో పదిమీటర్ల వెడల్పూ ఆరుమీటర్ల ఎత్తులో చెక్కిన ఈ సింహం ప్రతిమ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది.