telugukiranam

Thailand – Bangkok Tourism / ధాయ్ లాండ్ – బ్యాంకాక్ పర్యాటకం

Thailand – Bangkok Tourism / ధాయ్ లాండ్ – బ్యాంకాక్ పర్యాటకం
షాపింగ్ సెంటర్లు
బ్యాంకాక్లో షాపింగ్ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్ షాపింగ్ సెంటర్. ఇది కూడా చావ్ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్ బాంబే మార్కెట్ కూడ. ఇది థాయ్లాండ్కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్.
థాయ్లాండ్లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్లాండ్లో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చు అని థాయ్లాండ్ పర్యాటకం అథారిటీ ప్రకటించింది.
కౌయాయ్ నేషనల్ పార్కులో...
పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే... అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స్, గోల్ప్ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్, నైట్ సఫారీ, ట్రెక్కింగ్కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్ జంటలను అలరించే బ్యూటిఫుల్ స్పాట్లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్. ఈ పార్క్ పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడా. కౌయాయ నేషనల్ పార్క్ నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
మసాజ్ సెంటర్
బ్యాంకాక్లో ఏ వీధిలో చూసినా మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్ల్యాండ్ మసాజ్ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్ను గౌరవించినట్లు.
య్ సంప్రదాయ నాట్యం లికాయ్. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి.
ఈ దేశం ఆర్కిడ్ పూలకు ప్రసిద్ధి. దాదాపు 15వేల రకాల ఆర్కిడ్స్ ను సాగుచేస్తారు. ధాయలాండ్ వెళ్లాలనుకునేవారు ఇంకొక విషయం గమనించవలసి ఉంది. ధాయ్ కరెన్సీని ఇక్కడి వారు చాలా గౌరవిస్తారు. కరెన్సీపై కాలుపెట్టడం ఇక్కడ చాలా నేరం. శిక్షార్హం కూడా.
Bangkok Tourism / బ్యాంకాక్
బ్యాంకాక్లో ‘ఎరవాన్ శ్రైన్’గా పిలిచే బ్రహ్మ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. బ్యాంకాక్లో బ్రహ్మదేవాలయం అంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. స్వయంగా థాయ్ ప్రజలే బ్రహ్మకు ప్రత్యేక ఆలయం కట్టడంతోపాటు నిత్యం పూజలు అందిస్తారు. ఈ ఆలయ సమీపంలో లక్ష్మీ, ఇంద్రుడు, నారాయణుడు, వినాయకుడు, త్రిమూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్టంచారు ఇక బ్యాంకాక్లో ‘పటయా సిటీ’ తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం, తెల్లని ఇసుక తిన్నెల బీచ్లో ఓ సారి దిగారంటే చాలు.. సమయమే తెలీదు. ఇంకా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అడ్వాంచర్స్ కూడా లభిస్తాయి. ఏనుగు సవారీ, ఏనుగుల విన్యాసాలు, థాయ్ సాంప్రదాయ వంటకాలు, డ్యాన్సులు, పోరాటాలు.. ఒకటేమిటీ ఇంకా చాలా ప్రత్యేకతలను మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఎర్వాన్ వాటర్ ఫాల్ ప్రాంతాన్ని చూడకుండా మాత్రం బ్యాంకాక్ టూర్ను పూర్తి చేయొద్దు.
బ్యాంకాక్లో నైట్ లైఫ్
ఇక్కడ థాయ్ మసాజ్కు పెట్టింది పేరు. కేవలం మసాజే కాదు, అంతకు మించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్లో అత్యధికులు ‘భూమ్ భూమ్’ జపం చేస్తుంటారు. ‘భూమ్ భూమ్’ అంటే. ‘మసాజ్ విత్ సెక్స్’. అయితే, ఇక్కడ అది లీగల్ కాదు. పర్యటకులంతా కేవలం సెక్స్ కోసమే థాయ్లాండ్ వస్తున్నారనే ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. నిబంధనలను కఠినతరం చేస్తోంది.
థాయ్ సంప్రదాయాల్లో మసాజ్, సెక్స్ అనేవి భాగమని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ సుమారు 3 మిలియన్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వీరిలో మూడో వంతు మైనర్లే. ఇక్కడ పర్యటకుల తాకిడి పెరిగే కొద్ది, యువతుల అక్రమ తరలింపు ఘటనలు కూడా పెరిగిపోయాయి. అయితే, ఆ దేశంలో మసాజ్, సెక్స్లు ఆర్థిక వనరులు కావడంతో ప్రభుత్వం కూడా చూసీ చూడకుండా వదిలేస్తోంది. బ్యాంకాక్ పర్యటించేందుకు ఏ సీజనైనా బాగానే ఉంటుంది. అయితే, సమ్మర్లో మాత్రం పర్యటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. దీంతో, ఇండియా-థాయ్లాండ్ మధ్య సేవలందించే విమానయాన సంస్థలు టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటిస్తాయి.
ఎలా వెళ్లాలి
థాయ్లాండ్ వెళ్లాలంటే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. వెట్ బ్యాగ్రౌండ్లో తీసిన రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్ కౌంటర్లో 1000 బాత్లు లేదా తత్కాల్ కౌంటర్లో 1200 బాత్ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్ బాత్లుగా మార్చుకోవచ్చు. థాయ్ బాత్ విలువ దాదాపుగా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్ రెంట్ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్లాండ్ పర్యాటకం అథారిటీ వెబ్సైట్ చూడవచ్చు.
విశాఖ, హైదరాబాద్ల నుంచి థాయ్లాండ్కు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. మే, జూన్ నెలల సమయంలో ఈ ప్రాంతాలకు వెళ్లే విమానాల ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఖర్చులుపరంగా చూసుకున్నా.. బ్యాంకాక్ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక థాయ్ బట్(THB)కు, భారత కరెన్సీకి ఒక రుపాయి మాత్రమే వ్యత్యాసం ఉంటుంది.
ధాయ్ ల్యాండ్ లో ఇంకా చూడ వలసినవి.....తరువాత పేజీలో....