telugukiranam

Turkey Tourism / టర్కీ పర్యాటకం

Turkey Tourism / టర్కీ పర్యాటకం
turky tourism ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక దేశాలలో టర్కీ కూడా ఒకటి. టర్కీని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని పిలుస్తారు. టర్కీ ఆసియా, ఐరోపా రెండు ఖండాలలోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు ఉన్నాయి. టర్కీ పెద్ద ద్వీపకల్ప దేశం. మూడుపక్కలా నల్ల సముద్రం, మెడిటేరియన్ సముద్రం మరియు ఏజియన్ సముద్రం చే ఆవరించబడి ఉంది. ఒక పక్క భూభాగం.
టర్కీ రాజధాని నగరం అంకారా. ఇస్తాంబుల్ టర్కీలోని పెద్ద నగరం. ఈ నగరం కూడా రెండు ఖండాల్లో విస్తరించిన నగరం. వీరి భాష టర్కిష్, లీరాలు వీరి ద్రవ్యం. టర్కీ ముస్లిం దేశం. ముస్లిం దేశం అయినప్పటి అభివృద్ధి చెందిన పర్యాటక దేశంగా పేరుపొందింది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం గల దేశం టర్కీ.
అందమైన సముద్రతీరాలు, అద్భుతమైన కట్టడాలతో, సాంస్కృతిక ఉత్సవాలతో టర్కీ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
టర్కీ ప్రజలు సహృదయులు. వీరు పర్యాటకులను తమ ఇంటికి ఆహ్వనించి భోజనం పెట్టి పంపిస్తారు.
మంచు మేనిముసుగు ధరించిన ప్రకృతి కాంత శీతాకాలపు సోయగం ‘పముక్కలే’. మంచుతో కప్పబడిన పర్వతాలు.. కనువిందుచేసే సెలయేటి ఒంపులు ఇక్కడి ప్రత్యేకతలు.
టర్కీ భాషలో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. చారిత్రక ప్రాధాన్యం, మధ్యయుగపు వైభవం, ఆధునిక నిర్మాణాలు, ప్రకృతి సోయగాలతో కూడిన దేశం టర్కీ.
అపెండస్ థియేటర్, బండ్రమ్ క్యాజల్, లైబ్రరీ ఆఫ్ సెల్సస్లు టర్కీ దేశంలో గల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు.
మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది..
రాజధాని నగరం ఇస్తాంబుల్ అభివృద్ధి చెందిన మానవ నాగరికతకు అద్దం పడుతుంది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యం లేని నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. పతారా బీచ్, పముక్కలే వంటివి టర్కీలో సందర్శించ దగ్గవి. పముక్కలే గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మరియు సహజంగా ఏర్పడిన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది.
పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగదు. ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇందులో స్నానం చేయడం మంచిదని యూరోపియన్లు కొన్ని శతాబ్దాలుగా నమ్ముతున్నారు. ఈ నమ్మకం కూడా పముక్కలేకు పర్యాటకులు ఎక్కువగా రావటానికి ఒక కారణం. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు చెలమలలో స్నానం ఇవి పముక్కలేకు మాత్రమే సొంతం.
తరువాత పేజీలో ......