మత్సేంద్రనాథుడనే మహాయోగి ఈ ఆసనం పరిచయం చేసినందుకు మత్స్యేంద్రాసనం అనిపిలుస్తారు. సు
ఖాసనంలో(బాచాబట్లు) కూర్చొని కుడికాలు తీసి ఎడమ మోకాలు పక్కన నిలిపి ఉంచాలి. కుడి చేయు తిన్నగా శరీరం పక్కన కుడివైపు నేలకు ఆనించాలి. కుడి చేతివేళ్ళు వెనకకు ఉండాలి. ఎడమ చేతిని పైకి ఎత్తి కుడి మోకాలు మీదుగా కుడిపాదం వేళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించాలి. కుదరని పక్షంలో కుడి మోకాలును పట్టుకోవాలి. శ్వాస వదలుతూ కుడి వైపునకు నడుం, భుజం మళ్ళిస్తూ పక్కకు తిరిగి వెనకకు చూడాలి. వీపు అంతా వెనుకకు తిరగాలి. శ్వాస పీలుస్తూ పూర్వస్థితికి రావాలి. 5 లేక 6 సార్లు చేసిన తరువాత కాళ్ళుమార్చి ఇలాగే చేయాలి.
ప్రయోజనాలు :
వెన్నెముక, వీపు, కండరాలు బలపడతాయి. వెన్నెముక, నాడీమండలం సామర్ధ్యం పెరుగుతుంది. నడుము దగ్గర కొవ్వు తగ్గతుంది. పాంక్రియాస్ గ్రంధి బాగాపనిచేస్తుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. మలబద్ధకం తగ్గి ఆకలి పెరుగుతుంది.