header

Yogasanalu

భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన, అతిప్రాచీనమైన వ్యాయామం యోగా. పూర్తి స్ధాయి వ్యాయామాన్ని చేయటం వలన కలిగే ఫలితాలు యోగా ద్వారా పొందవచ్చు
యోగా చాలా తేలికైంది, సరళమైంది. ఆసనాలు ఒకసారి నేర్చుకుంటే చాలు. ఎవరికివారే చేసుకోవచ్చు, ఎలాంటి ఉపకరణాలూ అవసరం లేదు. పెద్దగా సమయం కూడా పట్టదు. క్రమంగా సాధన చేస్తే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. యోగాను ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయొచ్చు. అయితే కొన్ని పద్ధతులు పాటించటం మంచిది.
యోగాసనాలను ఉదయం పూట.. అదీ పరగడుపున చేయటం మంచిది. ఒకవేళ భోజనం చేస్తే 4-5 గంటల తర్వాత.. అల్పాహారం తీసుకుంటే 2-3 గంటల అనంతరం చేయాలి.
యోగాసనాలు వేసేటప్పుడు వదులైన దుస్తులు ధరించాలి. పాదాలకు చెప్పులు, బూట్ల వంటివి ధరించరాదు.
ాలి, వెలుతురు బాగా వచ్చే ప్రశాంతమైన ప్రదేశంలో.. లేదా కిటికీలు, తలుపులు తెరచి ధారాళంగా వెలుతురు వస్తున్న గదుల్లో.. సమతలంగా ఉన్నచోట యోగా చేయాలి. ఉదయం సూర్యుడి కిరణాలు పడే ప్రాంతంలో యోగా చేయటం ఎంతో మేలు.
చాప, దుప్పటి, శుభ్రమైన వస్త్రం.. ఏదైనా పరచి దాని మీద కూచొని ఆసనాలు వేయాలి. నేల, గచ్చు, బండల మీద వేయకూడదు.
యోగా చేస్తున్నప్పుడు మధ్యలో మల, మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే బలవంతాన ఆపుకోకూడదు. విసర్జన అనంతరం తిరిగి కొనసాగించాలి. దాహం వేస్తే కొద్దిగా నీళ్లు తాగొచ్చు. యోగాసనాలను నెమ్మదిగా, అలసట లేకుండా తాపీగా చేయటం చాలా ముఖ్యం. తొందర పనికిరాదు.
యోగా చేయటం ముగిశాక తప్పకుండా మూత్ర విసర్జన చేయాలి.
జాగ్రత్తలు
కొన్ని ఆసనాలు గర్భిణులు వేయటం తగదు. అందువల్ల గర్భిణులు నిపుణుల సలహా మేరకే యోగ సాధన చేయాలి. అలాగే క్యాన్సర్, రెటీనా విడిపోవటం, మధుమేహం, మూర్ఛ, గుండెజబ్బు, అధిక రక్తపోటు, హెచ్ఐవీ, మల్టిపుల్ స్క్లెరోసిస్, శారీరక వైకల్యం వంటి వాటితో బాధపడేవారు కూడా నిపుణులను సంప్రదించి తగిన ఆసనాలను ఎంచుకొని, సాధన చేయాలి.

ప్రాణాయామం
సర్వాంగాసనం
హలాసనం
శీర్షాసనం
అర్ధ మత్స్యేంద్రాసనం
ఉత్కుట పవన ముక్తాసనం
సుప్త వజ్రాసనం
శశాంకాసనం
వజ్రాసనం
వక్రాసనం
భుజంగాసనం
సుఖాసనం
పద్మాసనం
వృష్టాసనం
కోణాసనం
గోముఖాసనం
కటి చక్రాసనం
ధనురాసనం
శలభాసనం
పవనముక్తాసనం
అశ్వసంచాలనాసనం
త్రికోణాసనం
తాడాసనం