header

Bhujangasanam

భుజంగాసనం
చాలా ఉపయోగ కరమైనదిగా చెప్పవచ్చు. ఈ ఆసనాన్నివేయటం వలన వెన్నుముకలోకలిగే నొప్పి నుండి బయటపడవచ్చు వెన్నుముక సమస్యలతో భాదపడే వారు ఈ ఆసనాన్ని వేయటం వలన వెన్నెముక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
భుజంగాసనం వేయవలసిన విధానం
నుదురుభాగభూమికి అనుకునేలాగా నెలపై బోర్లా పడుకోండి. ఆ తరువాత మీ అరచేతులను ఛాతీప్రక్కగా ప్రక్కటెముకల వద్ద ఉంచి నడుం దగ్గరనుండి శరీరాన్ని పైకి లేపండి(వెనుకకు), మీకాళ్ళను అలానే చాపి, కాలియొక్కబొటన వేలును నెలకు తాకి ఉంచండి. ఈ తరువాత, నెమ్మదిగా గాలిని పీల్చి వదలండి. ఈ విధంగా చేయటంవలన బరువు తగ్గవచ్చు.
భుజంగాసనం వలన ఉపయోగాలు ఈ రకమైన ఆసనాన్నిగురువులు లేక నిపుణుల వద్ద నేర్చుకున్న తరువాత, ఇంట్లోనే రోజూ వేయవచ్చు భుజంగాసనంను రోజూ ఇంట్లో అనుసరించటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్నిఇక్కడ తెలుపబడ్డాయి ఈ ఆసనం వేయటం వలన వెన్నెముకపై ఒత్తిడి ఏర్పడి, బలాన్ని చేకూరుస్తుంది. వెన్నెముకపై భాగం మరియు క్రిందిభాగం ఒత్తిడి కలిగేలా ఈఆసనం నిర్మితం చేయబడింది. కానీ, వెన్నునొప్పి ఎక్కువగా ఉన్న వారు మాత్రం ఈ ఆసనాన్నివేసే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది.
అంతర్గతఅవయవాలనుఉత్తేజపరుస్తుంది భుజంగాసనం అంతర్గత అవయవాల పనితీరును కూడా మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా, జీర్ణాశయ సమస్యలతో భాదపడే వారికి ఈఆసనం చాలారకాలుగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. br/> ఈఆసనాన్నివేయటం వలన పొట్టచుట్టూ ఉన్న కొవ్వు సులభంగా తగ్గిపోతుంది. రోజూ భుజంగాసనంను అనుసరించటం వలన పొట్టచుట్టూ ఉండేకండరాలపై ఒత్తిడి పెరిగి, కొవ్వు కరిగిపోతుంది.
ఈఆసనాన్నివేయటం వలన అలసట, తలనొప్పి మరియు బలహీనత వంటి వివిధరకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వీటితో పాటుగా మానసిక సమస్యలు కూడాఈ ఆసనం ద్వారా కుదుటపడతాయి.
భుజంగాసనం వలన కలిగే మరొక ప్రయోజనం- రక్తప్రసరణలో మెరుగుదల. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే, శరీరకణాలకు కావలసిన పోషకాలు మరియు ఆక్సిజన్ సరఫరా ఎక్కువగా జరుగుతుంది. మెరుగైన రక్తప్రసరణ వలన హార్మోన్ లు కూడా సరైన స్థాయిలో విడుదల అవుతాయి.