header

Kati Chakrasanam

ధనురాసనం
ఈ ఆసనం యొక్క భంగిమ ఎక్కుపెట్టిన ధనస్సును పోలి ఉంటుంది కనుక దీనిని ధనురాసనం అంటారు. చేసే విధానం :
చేతులు తిన్నగా చాచి బోర్లపడుకొని కాళ్ళమధ్య అడుగు దూరం ఉండేలా చూడాలి. తరువాత రెండు కాళ్ళను మోకాళ్ళ భాగంనుండి వెనుకకు వంచాలి ఇప్పుడు ఎడమ చేతిని వెనుకకు పోనిచ్చి ఎడమకాలి వేళ్ళ కిందుగా పట్టుకోవాలి. తరువాత కుడి చేతిని వెనుకకు చాపి కుడికాలి కుడికాలి వేళ్ళకిందుగా పట్టుకోవాలి.
తరువాత అదే భంగిమలో చేతుల పట్టు బిగించి కాళ్ళను సాధ్యమైనంత పైకి లేపుతూ ఛాతీని మరియు మెడను నెమ్మదిగా పైకి లేపి ఛాతీ కదలకుండా కాళ్ళను కదలకుండా పట్టుకోవాలి.
జబ్బలు, పిక్కలు, తొడలు బాగా లావుగా ఉన్నవారికి కాళ్ళు చేతులు సరిగా అందవు. అటువంటి వారు కాలి వేళ్ళు అందకపోతే పాదాన్ని పట్టుకోవచ్చు లేదా నెమ్మదిగా అభ్యాసం చేయవచ్చు.
ప్రయోజనాలు
నడుము నొప్పులు, మెడనొప్పులు తగ్గుతాయి. పిక్కల బరువు తగ్గుతుంది. నడుము సన్నగా మారుతుంది. శరీరం బరువు తగ్గుతుంది. గర్భసంచిపై, మూత్రకోశం ఉత్తేజితమై వాటి తాలూకా దోషాలు నివారించబడుతాయి. హెర్నియా ఉన్నవారు, హెర్నియా ఇబ్బందులు ఉన్న వారు ఈ ఆసనాన్ని వేయరాదు.