header

Gomukhasanam

గోముఖాసనం
ఈ ఆసనాన్ని రెండు విధాలుగా చేయవలసి ఉంటుంది. యోగా మ్యాట్ లేక మందపాటి దుపట్టా మీద సౌకర్యంగా కూర్చొని రెండుకాళ్ళను చాపాలి. కుడికాలును ఎడమకాలుమీదుగా వెనుకకు మడవాలి. అలాగే ఎడమకాలును కుడి కాలు కిందుగా వెనుకకు మడవాలి. రెండు మోకాళ్ళు బాగా దగ్గరగా కలిసేటట్లు కాళ్ళను ఉంచాలి. కుడిచేతిని పైకి లేపి కుడిచెవి పక్కగా వీపు వెనుక భాగానికి చేర్చిఉంచాలి. ఎడమ చేతిని ఎడం పక్కగా వెనుకకు చేర్చాలి. ఇపుడు రెండు చేతి వ్రేళ్ళను కలిపి పట్టుకోవాలి. మెడ, నడుమును నిఠారుగా ఉంచాలి. కొత్తగా అభ్యాసం చేసేవారికి చేతివేళ్ళు అందవు కనుక నెమ్మదిగా అభ్యాసం చేయవచ్చు. తరువాత చేతులు మార్చుకుని ఇదే విధంగా చేయాలి. కొంతమందికి తొడల లావు వలన లేదా కీళ్ళు వంగక కొద్దిగా మాత్రమే వంగుతాయి. కనుక వీరు అర్ధగోముఖాసనంతో మొదలు పెట్టి తరువాత గోముఖాసనాన్ని వేయవచ్చు. ప్రయోజనాలు జబ్బలు, భుజాలు లావుగా ఉన్నవారికి ఆ ప్రాంతాలలో కొవ్వు కరిగి భుజాలు అందంగా మారుతాయి. భుజాల నొప్పులు తగ్గుతాయి. నరాల నొప్పులు, చేతుల తిమ్మిరులు తగ్గుతాయి. కీళ్ళవాతం, కీళ్లు పట్టివేయటం, కీళ్ళు అరగటం వంటి ఇబ్బందులు రావు.