విపరీతకరణి మరియు సర్వాంగాసనానికి కొనసాగింపు హలాసనం. సర్వాంగాసనాన్ని సాధన చేసిన తరువాతనే హలాసనాన్ని వేస్తారు. హలము అంటే నాగలి. నాగలి ఆకారంలో శరీరాన్ని వంచుతారు కాబట్టి హలాసనం అంటారు. తల వెనుకాల వైపుకు, మోకాలు వంచకుండా కాలివ్రేళ్ళు, భూమికి ఆనేవరకు వంచాలి.
ఈ భంగిమలో 30 సెకన్లు నుంచి ఒకనిమిషం సేపు మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువసేపు ఉండరాదు.. అది వెన్నును చక్కగా అన్ని పక్కలకు వంచేట్లుగా చేస్తుంది. వెన్నుని సాగదీయటానికి ఇంతకు మించిన వ్యాయామం ఏదీ లేదు.
దీని వలన వెన్నెముకలోని డిస్కులు తెరచుకుంటాయి.
కండరాలు స్నాయివులు బాగా సాగుతాయి. మీరు కనక వెన్ను మరియు మెడ పట్టేసి బాధపడుతూ ఉంటే వాటిని వదిలించుకోవటానికి సహాయం చేస్తుంది.
ప్రయోజనాలు :
ఊబకాయం, కండరాల నొప్పులు, కాలేయం, మరియు ప్లీహం పెద్దది అవ్వటం, మలబద్ధకం,అజీర్తి,కీళ్ళ నొప్పులు,వెన్ను, మెడ పట్టేయటం వంటివి ఈ ఆసనం వలన తగ్గుతాయి.
పొత్తికడుపు కండరాలు థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అవుతాయి.