కటి చక్రాసనం
కటి అంటే నడుము క్రింది భాగం. కటిని త్రిప్పి చేయటం వలన ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. ఈ ఆసనం వలన తొడలు, నడుము, తుంటి భాగాలలోని కొవ్వు కరుగుతుంది.
కటి చక్రాసనం వేసే పద్ధతి.
నేలపై నిఠారుగా నిలబడాలి. కాళ్ళమధ్య కనీసం ఒకటిన్నర అడుగుల దూరం ఉండాలి. రెండు చేతులను ముందుకు సమాంతరంగా చాపి ఎడమ చేతని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. నడుం దగ్గర నుండి శరీరభాగాన్ని వీలైనంత కుడివైపుకు త్రిప్పాలి. ఈ భంగిమలో కొద్ది సెకన్లు ఉండి పూర్వస్థితికి రావాలి.
తరువాత కుడిచేతిని ఎడమ భుజంపైకి చేర్చి ఎడమచేతిని వెనుకకు మడచి పైవిధంగానే చేయాలి. ఇలా కనీసం 5 లేక 6 ఆరుసార్లు చేయాలి. నడుము త్రిప్పేటపుడు జాగ్రత్తగా నెమ్మది త్రిప్పాలి. కుదరకపోతే నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.