header

Konasanam

కోణాసనం
నేలమీద తిన్నగా నిలబడి రెండు కాళ్ళను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. కుడిపాదాన్ని కుడివైపుకు తిప్పాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి ఎడమ కాలును 90 డిగ్రీల కోణంలో వంచాలి. కుడికాలును మాత్రం వంచకుండా తిన్నగా ఉంచాలి. కుడి చేయితో కుడి మోకాలు కింద భాగాన్ని పట్టుకొని మెల్లగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని కుడివైపుకు వంచాలి. శ్వాస మాములుగా తీసుకుంటా 30 సెకన్లపాటు ఈ భంగిమలో ఉండాలి. అంతసేపు ఉండలేని వారు 5 నుండి 10 సెకన్ల పాటు ప్రయత్నించి నెమ్మదిగా సమయాన్ని పెంచుకోవాలి. ఈ ఆసనాన్ని వేయటం వలన శరీరంలోని కొవ్వు తగ్గి శరీరానికి మంచి ఆకృతి వస్తుంది. స్ర్తీలకు యోని దగ్గర ఉండే కండరాలు బిగుతుగా మారి దాంపత్యజీవితం ఆనందించేలా చేస్తుంది.