జాగ్రత్తలు
మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ ఆసనాన్ని వేయరాదు
సమాంతరంగా ఉన్న నేలపై యోగా మ్యాట్ కానీ, మందపాటి దుపట్టా గానీ వేసుకొని సుఖాసనంలో కూర్చోవాలి.
తరువాత కుడికాలి పాదం ఎడమ తొడ మీదకు వచ్చేలా పెట్టుకోవాలి.
తరువాత ఎడమకాలి పాదం కుడి తొడమీదకు వచ్చేలా ప్రయత్నించాలి. బలవంతంగా చేయకుండా నెమ్మదిగా అభ్యసిస్తూ చేయాలి. రెండు పాదాల మడమలు పొత్తికడుపుకు తగులుతూ ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను మోకాళ్ళమీదకు చాచుకోవాలి లేదా పటంలో చూపిన విధంగా గానీ ఉంచాలి.
పద్మాసనం వలన మెదడు ప్రశాంతంగా ఉంటుంది. నాడులు, కండరాలు బలపడతాయి. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలు, స్ర్తీలలో రుతుసమస్యలు తగ్గుతాయి.