కపాలం అంటే పుర్రె, భాతి అంటే దీపం అని సంస్కృతంలో అర్ధం. గాలి మనం గాలి పీల్చి వదిలేటపుడు కార్బన్ డయాక్సైడ్ బయటకుపోయి రక్తశుద్ధి జరుగుతుంది.
సుఖాసనంలో గాని లేక పద్మాసనంలోగాని కూర్చుని రెండు చేతులను మోకాళ్ళపై ఉంచి, బొటనవ్రేలు చివరిని, చూపుడు వ్రేలితో కలిపి చిన్ముద్రలో వుంచి గుండెలనిండా గాలి పీల్చండి. గాలిని వదులుతూ, నడుము భాగాన్ని కుంచింప చేయండి. కడుపుయొక్క కండరాలను బలాన్నంతా ఉపయోగించి బయటకు, లోపలకు కదపండి.
ప్రయోజనాలు :
మన శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపింస్తుంది. ముఖానికి, చర్మానికి కాంతి తెస్తుంది.
నిటారుగా కూచొని, రెండు చెవుల్లో రెండు వేళ్లను జొప్పించాలి. మోచేతులను భుజాలకు సమానంగా ఉండేలా చూసుకోవాలి. br/>
గాలిని లోనికి పీల్చుకొని.. కొద్దిసేపు అలాగే పట్టి ఉంచాలి. తర్వాత గొంతుతో తుమ్మెదలా చప్పుడు చేస్తూ ముక్కు రంధ్రాల ద్వారా గాలిని బయటకు వదలాలి. నోటిని తెరవకూడదు.
సూర్యభేదిలో- కుడి ముక్కు రంధ్రం నుంచి శ్వాసను తీసుకొని, ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇది ఒంట్లో వేడిని పుట్టిస్తుంది. కాబట్టి దీన్ని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయాలి. ఆస్థమా, అలర్జీ వంటి శ్వాస సమస్యలు గలవారికిది బాగా ఉపయోగపడుతుంది.
చంద్రభేదిలో- ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసను తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో వదిలేయాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చేయాలి. జ్వరం, అధిక రక్తపోటు వంటివి గలవారికిది బాగా ఉపయోగపడుతుంది.