సర్వాంగాసనం అంటే అన్నీ అవయవాలతో సమన్యయంతో చేసే ఆసనం.
దీని ద్వారా శరీరంలోని అంతర్గత అవయవాలన్నింటినీ బలోపేతం చేసుకోవచ్చు. అవి ఆరోగ్యంగా, బలంగా వుండేటట్టు తయారు చేస్తుంది. అందుచేతనే దీనిని సంపూర్ణ ఆసనంగా చెప్తారు.
లాభాలు :
మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడిని తొలగిస్తుంది. తేలికపాటి మానసిక వ్యాకులతను దూరం చేసుకోవచ్చు.
థైరాయిడ్, ప్రొస్టేట్ గ్రంధులను, పొత్తికడుపులోని వివిధ భాగాలను ఉత్తేజితం చేస్తుంది.
అరుగుదలను పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. నిద్రలేమిని పారద్రోలుతుంది.
ఉబ్బసం, వంధ్యత్వం, సైనసైటిస్ వంటి వ్యాధుల చికిత్సలో ఎంతో ఉపయోగపడుతుంది.