శశాంకాసనం
శశాంకం అంటే కుందేలు, కుందేలులా కూర్చుని చేసే ఆసనం కనుక శశాంకాసనం అని అంటారు. వజ్రాసనంలో కూర్చొని, రెండుచేతులు నడుము వెనుకకు పెట్టి ఒక చేతితో రెండో చేతి మణికట్టును పట్టకోవాలి.శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. నుదుటిని నేలకు ఆనించేందుకు ప్రయత్నించాలి . పిరుదులను మడమలమీద నుంచి కదపకూడదు. కొంతసేపటి తరువాత శ్వాస పీలుస్తూ యధాస్థితికి రావాలి.
ఆరంభంలో సాధ్యమైనంత వరకు మాత్రమే వంగాలి. బలవంతంగా వంగరాదు. సాధారణంగా 5,6 సార్లు ఇలా చేయాలి. మెదడుపై మనస్సుసు కేంద్రీకరించాలి.
ప్రయోజనాలు :
నడుము మెడ నొప్పులు తగ్గుతాయి.