header

Seershanam

శీర్షాసనాన్ని ఆసనాలన్నింటికీ రాజు అని పిలుస్తారు. ఇది పూర్తి శరీరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.
తలను భూమికి ఆనించి, వెన్నును పాదాలను మెడను నిఠారుగా నిలిపి వుంచడమే శీర్షాసనం.కొత్తగా దీనిని వేసేవారు తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి.
ప్రయోజనాలు
మొదడుకు రక్తసరఫరా పెంచుతుంది. తెలివితేటలు, జ్గ్నాపకశక్తి పెరగటంలో సహాయం చేస్తుంది.
పిట్యూటరీ , పీనియల్, థైరాయిడ్ మరియు పెరాథైరాయిడ్ గ్రంథులను ఉత్తేజ పరుస్తుంది.
వెన్నుముక అమరికను సరిగా ఉంచటంలో సహాయం చేస్తుంది.
మెదడుకు రక్త సరఫరా పెరగటంవలన జట్టు పెరుగుతుంది. భూమ్యాకర్షణ శక్తిని తిప్పటం ద్వారా ఎన్నో ముఖ్య మైన భాగాలను వాటి వాటి స్థానాలలో నిలబెడుతుంది. జాగ్రత్తలు : ర
క్తపోటు తక్కువ వున్నవారు, లేక ఎక్కువగా వున్నవారు శీర్షాసనం వేయరాదు. అలాగే రక్తనాళాలలో అడ్డంకులు వారు వేయకూడదు. అంతేగాక పక్షవాతంగానీ, గుండెపోటుతో ఇబ్బంది పడేవారు దీనిని వేయరాదు.
కంటికి సంబంధించిన ఇబ్బందులున్న వారు ఈ ఆసనాన్ని వేయకూడదు.
మలబద్ధకంతో బాధపడుతున్నవారు లేదా పిట్యూటరీ, పీనియల్ మరియు థైరాయిడ్ గ్రంధులలో లోపాలున్నా వారుకూడా శీర్షాసనం వేయరాదు.