“సుఖః”అంటే“సుఖము”అని, “ఆసన”అంటే“భంగిమ”అని సంస్కృతంలో అర్ధం. ఈ రకం యోగాసన అనుసరణలో చాపపై కూర్చోని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మడచి (బాచాబట్లు లేక నేల మీద కూర్చొని భోజనం చేసే పద్ధతి)లో కూర్చొండి వెన్నుముక నిఠారుగా ఉండేట్లుగా చూసుకోండి.
మీరు ఓపిక ననుసరించి ఎంతసైపైనా ఈ ఆసనం వేయవచ్చు. ఈ ఆసనం మీ మెదడుకి ఉపశమనాన్ని కలిగిస్తుంది, ఫలితంగాఒత్తిడితగ్గి, ఏకాగ్రత మెరుగవుతుంది.