header

Supta Vazrasanam

సుప్త వజ్రాసనం
ఈ ఆసనం కష్టమైనది కనుక నెమ్మదిగా చేయాలి. లేదా నిపుణుల సహాయంతో గాని గురువు సమక్షంలో నేర్చుకొని గాని ఈ ఆసనం వేయాలి. వజ్రాసనం వేసి కూర్చోవాలి. రెండు అరచేతులను శరీరంపక్కన నేలకు ఆనించాలి. చేతివేళ్ళు ముందుకు ఉండాలి. అనంతరం ఒకదాని తరువాత మరో మోచేతిని నేలకు ఆనిస్తూ తలను వెనుక భాగాన్ని నేలకు తాకించేందుకు ప్రయత్నించాలి. రెండు చేతులు ఎత్తి తొడలపై ఉంచాలి. లేదా రెండు చేతులు జోడించి ఛాతీ దగ్గర ఉంచాలి. శ్వాస సామాన్యంగా ఉండాలి. అయిదు సెకన్ల నుండి రెండు నిమిషాల వరకు ఇలాగే ఉండాలి. తరువాత మోచేతులను నేలకు నొక్కి అనిస్తూ పైకి లేచి వజ్రాసన స్థితికి రావాలి. రెండు సార్లు ఇలా చేయాలి.
ఆరంభంలో శరీరాన్ని వెనక్కు మెల్ల మెల్లగా వంచేందుకు ప్రయత్నించాలి. కొద్ది రోజుల తరువాత పూర్తిగా అలవాటు అవుతుంది.మోకాళ్ళు,నడుం నొప్పి ఉన్నవారు నొప్పులు తగ్గాక వేయాలి.
ప్రయోజనాలు
పిక్కలకు, నడుముకు, తొడలకు శక్తి వస్తుంది.