పాదాల మధ్య కాస్త ఎడం ఉండేలా నిలబడాలి.
కుడి చేతి వేళ్లను ఎడమ చేతి వేళ్లలో జొప్పించాలి.
చేతులను సాగదీస్తూ వీలైనంతవరకు పైకి లేపాలి.
శరీరం కూడా నిటారుగా సాగేలా చూసుకోవాలి.
30-60 సెకండ్ల తర్వాత యథాస్థితికి రావాలి.
వెన్ను, కాళ్లు, చేతులు, నాడులు.. అన్నీ బాగా సాగుతాయి. దీంతో ప్రతి నాడీ శక్తిని పుంజుకుంటుంది. బద్ధకం, అలసట దూరమవుతాయి. తాడాసనాన్ని పడుకొని కూడా కాళ్లను, చేతులను సాగదీస్తూ చేయొచ్చు.