header

Trikonasanam

త్రికోణాసనం
నేలపై నిల్చోని కాళ్ళను కొంచెం ఎడంగా ఉంచాలి. నెమ్మదిగా ముందుకు 90 డిగ్రీల కోణంలో వంగాలి. ఎడమ చేతితో కుడి పాదం వేళ్ళను తాకాలి. కుడి చేతిని పూర్తిగా పైకి ఎత్తి తలను కూడా కుడివైపుకు త్రిప్పి కుడిచేతి వైపు పైకి చూడాలి. ఈ భంగిమలో పది సెకన్లు ఉండాలి. తరువాత యధాస్ధానానికి వచ్చి (నిలబడిన స్థితికి) కుడిచేతితో ఎడమ పాదాన్ని తాకూతూ పైవిధంగానే చేయాలి. ఇలా భంగిమను మార్చుకుంటూ 20 నుండి 30 సార్లు చేయాలి.
ప్రయోజనాలు
పొత్తికడుపు కండరాలు బలపడుతాయి. నాడీ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.