ఉత్కుట పవన ముక్తాసనం
మామూలుగా కూర్చొని రెండు కాళ్లూ ముందుకు చాచాలి. మడమలు రెండూ కలిపి ఉంచాలి. కుడి మోకాలును మడిచి రెండుచేతులతో పట్టకుని తొడను పొట్టకు ఆనించాలి. క్రమేపి శ్వాస పీలుస్తూ కుడికాలును తిన్నగా చాపాలి. అ ఎడమ కాలితోనూ చేయాలి.ఒక్కో కాలుతో చేసిన తరువాత ఒకేసారి రెండు మోకాళ్ళను మడిచి తొడలను పొట్టకు ఆనించాలి. చుబుకాన్ని రెండు మోకాళ్ళ మధ్య తాకించేందుకు ప్రయత్నించాలి. ఇలా మూడు,నాలుగుసార్లు చేయాలి.
ఏ వయసువారైనా పరగడుపున ఇలా చేయవచ్చు. లేదా ఆహారం తీసుకున్న అయిదు గంటల తరువాత ఈ ఆసనం వేయవచ్చు.
ప్రయోజనాలు :
మోకాళ్ళ నొప్పి, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గిపోతాయి. ఎసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గిపోతాయి.