వజ్రాసనం
రెండుకాళ్ళు ముందుకు చాచి కూర్చోవాలి. మోకాళ్ళు కిందకు మడచి రెండు పాదాల మీద పిరుదులు నించి మోకాళ్ళమీద చేతులు ఉంచాలి. తలను, వెన్నెముకను నిటారుగా ఉంచాలి.భోజనం చేసిన తరువాత ఈ ఆసనం వేయవచ్చు. 15-20నిమిషాలు ఈ ఆసనం వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరంభంలో ఒక కాలి మీద, క్రమేపి రెండు కాళ్ళ మీద కూర్చుని అభ్యాసం చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.
ప్రయోజనాలు
అజీర్తి, వాతం, సయాటిక నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. పిక్కలు, మోకాళ్ళ,తొడలు బలపడతాయి.