ఈ ఆసనం వలన వెన్నుముక మరియు తొడల కండరాలు బలపడతాయి. ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. శరీరం తేలికగా విశ్రాంతిగా ఉంటుంది. సెక్స్ పరంగా కూడా ఈ ఆసనం వలన మేలు కలుగుతుంది.
వృష్టాసనం వేసే పద్ధతి :
మెత్తటి దుప్పటి మీద లేక యోగా మ్యాట్ మీద మోకాళ్ళమీద కూర్చోవాలి. నెమ్మదిగా తలను, శరీరాన్ని వెనుకకు వంచుతూ విల్లులా (తొడలను ముందుకు వచ్చేటట్లు) మీ చేతులతో కాలి వేళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నించాలి. గాలిని మామూలుగా పీల్చి వదలుతూ 10 నుండి 30 సెకన్ల పాటు ఈ ఆసనంను వేయాలి. తరువాత యధాస్ధితికి వచ్చి మరలా ఈ ఆసనంను వేయవచ్చు. పూర్తిగా అభ్యాసం చేసిన తరువాత మీ ఓపికను బట్టి ఈ ఆసన సమయాన్ని పెంచుకోవచ్చ. కొత్తవారు నెమ్మదిగా అభ్యాసం చేయాలి. లేదా గురువులవద్ద గానీ నిపుణులవద్ద గానీ నేర్చుకొని చేయటం మంచిది.